నిమ్మకూరుకు వెళ్తున్న ఎన్టీఆర్ బయోపిక్ టీమ్

kalyan-ram-plays-role-of-nandamuri-harikrishna-in-ntr-biopi

సంక్రాంతికి ‘ఎన్టీఆర్’ బయోపిక్ రిలీజ్ అవుతున్న సందర్భంగా బాలకృష్ణ ఇవాళ నిమ్మకూరు వెళ్తున్నారు. స్వగ్రామం నిమ్మకూరులో తల్లిదండ్రులు ఎన్టీఆర్, బసవతాకరం దంపతుల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు. బాలయ్యతోపాటు డైరెక్టర్ క్రిష్, కల్యాణ్‌రామ్, ఈ మూవీలో బసవతారకంగా నటించిన విద్యాబాలన్ కూడా వెళ్తున్నారు.

Also Read : ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో ఏపీ శకటానికి దక్కని చోటు

సెలబ్రిటీల రాక సందర్భంగా గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న అన్నగారి బయోపిక్‌లో.. తొలి భాగం కథానాయకుడు ఈనెల 9న రిలీజ్ అవుతోంది. ఆ విశేషాలను చిత్ర యూనిట్ మీడియాతో పంచుకోనుంది. తర్వాత బాలయ్య సహా అంతా బెంగళూరు వెళ్తారు. అక్కడ కూడా బయోపిక్ ప్రమోషన్‌లో పాల్గొంటారు. తర్వాత తిరుపతి తిరిగి వస్తారు.