నిమ్మకూరులో ‘ఎన్టీఆర్’ బయోపిక్ టీమ్

సంక్రాంతికి ‘ఎన్టీఆర్’ బయోపిక్ రిలీజ్ అవుతున్న సందర్భంగా బాలకృష్ణ నిమ్మకూరు వెళ్లారు. స్వగ్రామం నిమ్మకూరులో తల్లిదండ్రులు ఎన్టీఆర్, బసవతాకరం దంపతుల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. బాలయ్యతోపాటు డైరెక్టర్ క్రిష్, కల్యాణ్‌రామ్, ఈ మూవీలో బసవతారకంగా నటించిన విద్యాబాలన్ కూడా ఉన్నారు.

Also Read : దారుణం.. అభం శుభం తెలియని మూడు నెలల చిన్నారిని తండ్రి..

సెలబ్రిటీల రాక సందర్భంగా గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న అన్నగారి బయోపిక్‌లో.. తొలి భాగం కథానాయకుడు ఈనెల 9న రిలీజ్ అవుతోంది.

ఎన్టీఆర్ బయోపిక్ ప్రమోషన్‌లో భాగంగా బాలయ్య సహా అంతా బెంగళూరు వెళ్లనున్నారు. తర్వాత తిరుపతి తిరిగి వస్తారు.