ఒక పాము మరో పాముని చుట్టుకుని బెడ్ మీద..

పాములకు చెట్లూ, పుట్టలూ నచ్చలేదా.. అడవుల్లోనించి ఏకంగా ఆరుబయటకు వచ్చేస్తున్నాయి.. జనారణ్యంలో మనుషులతో పాటు సంచరిస్తూ సహజీవనం చేయాలనుకుంటున్నాయా ఏంటి.. ఇంట్లో దూరి ఏకంగా బెడ్‌పైకి ఎక్కేసి.. ఒక దానితో ఒకటి కబుర్లాడుకుంటూ..

అయ్యో రామ.. అది కాదండి.. ప్యాషన్ పేరుతో ప్రపంచానికి ఓ కొత్త లెగ్గిన్ పరిచయం చేసింది ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కి చెందిన ఓ వనిత. వాటిపై మోజు పడిన ఓ ఇల్లాలు సరదాగా వేసుకుని వాళ్లాయాన్ని సర్‌ప్రైజ్ చేద్దామనుకుంది. రాత్రి పూట అవి వేసుకుని పడుకుని నిద్రలోకి జారుకుంది.

ఇంతలో బయట నుంచి వచ్చిన భర్త వాటిని చూసి నిజంగా పాములే అనుకుని భయపడ్డాడు. వెంటనే మూలన ఉన్న బ్యాట్‌ తీసుకుని బలంగా బాదాడు. డీప్ స్లీప్‌లో ఉన్న ఆ ఇల్లాలు కెవ్వున కేక వేసింది. అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. కాలు తీసి కాలు వేయలేకపోయింది. అడుగు కింద పెట్టలేకపోయింది.

విషయం తెలుసుకున్న భర్త.. భార్యని తీసుకుని వెంటనే ఆసుపత్రికి పరిగెట్టాడు. బ్యాటు బలంగా తగలడంతో డాక్టర్లు ఆమె కాలు విరిగిందని చెప్పారు. దాంతో భర్త నీ ఫ్యాషన్ తగలబడ. అయ్యేం లెగ్గిన్లే తల్లి అచ్చం పాముల్లానే ఉన్నాయి. నిష్కారణంగా నీ కాళ్లు విరగ్గొట్టాను అని బోరుమంటున్నాడు.