4 వ తరగతి విద్యార్థి మృతి కేసులో మరో మలుపు

extramarital-affair-woman-kills-husband-with-help-her-lover

హైదరాబాద్ శివారు శంషాబాద్‌ మండలం పాలమాకులలో 4 వ తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి మరో మలుపు తిరిగింది. క్షణికావేశంలో దినేశ్ ను ఓ మైనర్ బాలుడు హత్య చేసినట్టు దర్యాప్తులో జరిగింది. పోలీసులు నిందితున్ని అరెస్ట్‌ చేసి, జువైనల్ హోమ్‌కు తరలించారు.

ఆడుతూ పాడుతూ విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన పసివారు క్షణికావేశంలో తప్పులు చేస్తున్నారు. హంతకులుగా మారి జైళ్లకు చేరుతున్నారు. తాజాగా హైదరాబాద్‌ శివారు శంషాబాద్‌ మండలంలో జరిగిన ఓ పసివాడి హత్య కలకలం సృష్టిస్తోంది.

శంషాబాద్‌ మండలం పాలమాకుల గ్రామానికి చెందిన రాజు-నిర్మల దంపతుల కుమారుడు దినేశ్‌ నాలుగో తరగతి చదువుతున్నాడు. గత ఆదివారం సైకిల్‌పై వెళ్లిన ఆ బాలుడు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో దినేశ్‌ తల్లిదండ్రులు పాలమాకుల ప్రాంతంలో విస్తృతంగా గాలించారు. చెట్ల పొదల్లో అతను శవమై కనిపించాడు. తమ కుమారున్ని ఎవరో హత్య చేశారని దినేశ్‌ పేరెంట్స్ శంషాబాద్‌ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో పోలీసులు అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేశారు.

Also Read : కొత్త రూల్.. ఇక నుంచి ట్రైన్ ఎక్కాలనుకుంటే..

దినేశ్‌ మృతిపై పలు కోణాల్లో పోలీసులు విచారణ జరపగా ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. దినేశ్‌కు వరుసకు సోదరుడయ్యే 14 ఏళ్ల బాలుడే హత్య చేసినట్టు తెలిసింది. నిందితుడు పాలమాకులలోని మోడల్‌ స్కూల్ లో 9వ తరగతి చదువుతున్నాడు. అతను తరుచుగా స్కూల్‌ కు డుమ్మా కొడ్తున్నాడు. ఈ విషయాన్ని దినేశ్‌ తన తల్లిదండ్రులకు చెప్పడంతో అతనిపై నిందితుడు కక్ష పెంచుకున్నాడు. ఆదివారం బాలుడిని బయటకు తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని పాలమాకుల చెట్ల పొదల్లో పడేసి ఏమీ ఏరగనట్లుగా ఇంటికి చేరాడు. దినేశ్‌ కనిపించడం లేదంటూ అతని తల్లిదండ్రులను నమ్మించాడు. వారితో కలిసి వెతికినట్టు నటించాడు. అయితే పోలీసులు తమదైన కోణంలో విచారించే సరికి నిందితుడు నేరాన్ని అంగీకరించాడు.

నిందితుడిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు జువైనల్ హోమ్‌ కు తరలించారు. మరోవైపు అభంశుభం తెలియని దిశేష్ హత్యకు గురవడంతో తల్లిదండ్రులు, బంధువులు