దారుణం.. అభం శుభం తెలియని మూడు నెలల చిన్నారిని తండ్రి..

అమ్మ కడుపులోనించి బయటకు వచ్చి మూడు నెలలైనా కాలేదు ఆ చిట్టి తల్లి.. నాన్నకి ఎందుకంత కోపం వచ్చింది. అంత దారుణంగా ముక్కలు ముక్కలు చేయడానికి మనసెలా వచ్చింది. మనుషుల్లో మానవత్వం ఎందుకు చచ్చిపోతుంది. నోరులేని మూగజీవాలు కూడా కన్నబిడ్డల్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటాయి.. మరి మనిషి ఎందుకిలా..

తమిళనాడు తిరువణ్ణామలై జిల్లా కంబంపట్టు గ్రామానికి చెందిన కార్తికేయన్, రాజేశ్వరి దంపతులకు మూడు నెలల చిన్నారి ఉంది. కిరాణా దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కొద్ది రోజులుగా కార్తికేయన్ మనస్థాపంతో ఉంటున్నాడు.

అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక స్థోమత కార్తికేయన్‌కు నిద్ర పట్టకుండా చేసింది. ఓ రోజు అర్థరాత్రి తల్లి పక్కలో ఉండాల్సిన బిడ్డ మాయమైంది. పెరటి గుమ్మంలో నుంచి బిడ్డ ఏడుపు వినిపిస్తోంది. మంచం మీద భర్త కూడా లేడు. వెంటనే లేచి వెళ్లి చూసింది రాజేశ్వరి. భర్త కన్నబిడ్డని ముక్కలుగా నరకుతున్నాడు.

ఆ దృశ్యాన్ని చూసిన రాజేశ్వరి భయంతో కేకలు వేసి చుట్టు పక్కల వారిని మేల్కొలిపింది. ఆమె అరుపులు విన్న కార్తికేయన్ పరారయ్యేందుకు ప్రయత్నించాడు. కానీ ఈలోపు చుట్టుపక్కల వారు వచ్చి అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు.