గోడ నిర్మాణంలో మార్పులు చేసిన ట్రంప్

trump-emergency-border-wall-government-shutdown

అమెరికా మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించాలని పట్టుదలతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కాస్త తగ్గారు. సిమెంట్ గోడకు బదులుగా స్టీల్ తో గోడ నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్టీల్ కంచె ధృడంగా ఉండటమే కాకుండా అక్రమ వలసదారులను అడ్డుకుంటుందని ట్రంప్ తెలిపారు. ఇందుకు ఉక్కు పరిశ్రమల సంఘం ప్రతినిధులతో సమావేశమవుతానని ట్రంప్ తెలిపారు. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, డెమోక్రటిక్ పార్టీ కీలక నేతలతో చర్చించిన అనంతరం ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే దేశంలో షట్ డౌన్ కొనసాగుతుందని, గోడ నిర్మాణానికి నిధులను అందిస్తే సమస్య పరిష్కారమవుతుందన్నారు.