ఖుషీఖుషీగా మంచు అవ్రామ్ పుట్టినరోజు వేడుకలు

Vishnu Manchu throws a star-studded 1st birthday bash for his stylish son Avram

మంచు విష్ణు కుమారుడు అవ్రామ్ పుట్టిన రోజు వేడుకలు నిన్న(జనవరి 6) గ్రాండ్ గా జరిగాయి. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో పాటు చాలామంది సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. జనవరి 1న పుట్టిన అవ్రామ్ ను పెద్దవాళ్లంతా నిండు మనసుతో ఆశీర్వదించారు. తాత మోహన్ బాబుతో పాటు తల్లిదండ్రులు విష్ణు, వెరోనికాల ఆశీర్వాదాలు అందుకున్నాడు అవ్రామ్. సినిమా ఇండస్ట్రీలో A-1 అని చెప్పుకోదగ్గ పెద్దలతో పాటు పేరుగాంచిన రాజకీయ నాయకులంతా హాజరవ్వడంతో వేడుక కళకళలాడింది. పుట్టినరోజు సందర్బంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గుస్సీ బ్రాండ్ సూట్ ను ధరించిన అవ్రామ్.. అందర్నీ ఆకట్టుకున్నాడు. స్పెషల్ హెయిర్ స్టైల్ తో స్టార్స్ ని మరిపించాడు. ఫోటోలకు ఫోజులిచ్చాడు. అవ్రామ్ తో సెల్ఫీలకు పెద్దోళ్లంతా ముచ్చటపడ్డారు. అవ్రామ్ కు అక్కలైన ఆరియానా, వివియానాలు.. తమ్ముడితో కలిసి ఖుషీఖుషీగా గడిపారు.

Recommended For You