చర్మ సౌందర్యానికీ టూత్‌పేస్ట్..

ఉదయాన్నే లేచి బ్రష్ మీద పేస్ట్ పెట్టుకుని పళ్లు రుద్దుకునే పేస్ట్ వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయని తెలిస్తే ఎక్కువ పెట్టుకుని అస్సలు వేస్ట్ చేయరు. పేస్ట్‌తో పళ్లు తెల్లగానే కాదు చర్మం కూడా నిగారింపుని సంతరించుకుంటుందని తెలిస్తే వదిలి పెట్టగలరా.

అనేక రకాల చర్మ సమస్యలను కూడా టూత్‌పేస్ట్ తగ్గిస్తుంది. మంచి టూత్‌పేస్ట్‌తో మచ్చలు, మొటిమలు, డార్క్ స్పాట్స్, చర్మంపై ముడుతలు, చర్మ రంద్రాలు మొదలైనవి తొలగించడంలో కూడా సహాయపడుతుంది. క్రమం తప్పకుండా ఉపయోగిస్తే సమస్య తగ్గుముఖం పడుతుంది. చర్మం మెరుపుని సంతరించుకుంటుంది. మరిన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

ముఖంపై ముడతలను నివారిస్తుంది. తెల్లని టూత్ పేస్ట్ తీసుకుని ముడతలు ఉన్న ప్రాంతంలో రాత్రి పూట రాసి అలానే ఉంచి ఉదయాన్నే శుభ్రం చేయాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తుంటే మార్పు మీకే తెలుస్తుంది.
టేబుల్ స్పూన్ టూత్ పేస్టులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుని 10 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగితే చర్మం నిగారింపుని సంతరించుకుంటుంది.


మొటిమల సమస్యతో బాధపడేవారు కొద్దిగా టూత్‌పేస్ట్ తీసుకుని అక్కడ అప్లై చేస్తే ఒక రాత్రంతా ఉంచాలి. ఇలా క్రమం తప్పకుండా తగ్గే వరకు చేస్తుంటే మొటిమలు తగ్గిపోతాయి.
మచ్చలను తొలగించడంలో కూడా పేస్ట్ అద్భుతంగా పనిచేస్తుంది. పేస్ట్‌కి కొద్దిగా టమోటా రసాన్ని జోడించి మచ్చలున్న ప్రాంతంలో రాయాలి.
బ్లాక్ హెడ్స్‌ని నివారించడానికి టూత్ పేస్ట్ రాసి కొద్ది సేపు ఉంచి నిదానంగా ఆ ప్రాంతంలో సర్కిల్ లాగా రుద్దుతుండాలి. ఇలా తగ్గే వరకు చేస్తుంటే పూర్తిగా తొలగిపోతాయి.