తెలుగు చిత్ర పరిశ్రమలో మరో వివాదం.. పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు.. : దిల్‌ రాజు

dull raju again shok over halo guru premakosame

తాజాగా సినీ నిర్మాత అశోక్‌ వల్లభనేని చేసిన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో మరో వివాదానికి ఆజ్యం పోసాయి. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన పేట ప్రీ రిలీజ్‌ మూవీ ఈవెంట్‌ సందర్భంగా.. నిర్మాత అశోక్‌ వల్లభనేని చేసిన వ్యాఖ్యలు కొత్త కాంట్రవర్శికి తెరలేపాయి.

మంచి సినిమాలకు థియేటర్స్ ఇవ్వకుండా చిన్న సినిమాలను చంపేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు నిర్మాత అశోక్ వల్లభనేని. తన సినిమా విడుదలకు థియేటర్స్‌ విషయంలో ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. కొందరు బడా నిర్మాతలు తన సినిమాను అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు థియేటర్లు ఇచ్చేందుకు యువీ క్రియేషన్స్, అల్లు అరవింద్, దిల్‌రాజుకు నొప్పేంటని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వీళ్లంతా థియేటర్స్‌లోనే పుట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

Also Read : ‘యన్‌.టి.ఆర్‌’ ఆడియో వేడుకను నిమ్మకూరులో అందుకే నిర్వహించలేదు : బాలయ్య

అంతే కాదు అల్లు అరవింద్‌, దిల్ రాజులను నయీం మాఫియాతో పోల్చారు అశోక్‌ వల్లభనేని. తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం స్పందించాలని.. ఇలాంటి కుక్కలకు బుద్ది చెప్పాలని తీవ్ర పదజాలతో విరుచుకుడ్డారు. నయీంని చంపేసి కేసీఆర్ ఎంతో మందికి మేలు చేశారు. ఇలా థియేటర్ మాఫియా ఉన్న వాళ్లని ఎందుకు షూట్ చేయరని ప్రశ్నించారు. సాధారణ జనానికి వినోదాన్ని దూరం చేస్తూ.. చిన్న సినిమాలను చంపేస్తున్న ఇలాంటి వాళ్లపై చర్యలు తీసుకోవాంటూ ఆవేశంగా మాట్లాడారు అశోక్‌.

అల్లు అరవింద్‌, దిల్‌ రాజును టార్గెట్‌ చేస్తూ ఇలా నిర్మాత వల్లభనేని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు టాలీవుడ్‌లో హాట్‌ టాపిగ్గా మారాయి. అశోక్‌ వ్యాఖ్యలపై అటు అంతే స్థాయిలో ధీటుగా స్పందించారు నిర్మాత దిల్‌ రాజు. ఎఫ్‌-2 మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ కార్యక్రమంలో పాల్గొన్న దిల్‌ రాజు…అశోక్‌ వల్లభనేనిపై మండిపడ్డారు. సంక్రాంతిలో నాలుగు బడా సినిమాలు వస్తుండడంతో.. థియేటర్ల కోసం తాము తీవ్ర ఒత్తిడికి లోనయ్యామని.. మూడు తెలుగు సినిమాలు ఉన్నపుడు పక్కరాష్ట్రం నుంచి వచ్చే సినిమాకు థియేటర్లు ఎలా అడ్జెస్ట్ అవుతాయని ప్రశ్నించారు దిల్‌ రాజు.

టంగ్‌ స్లిప్పై పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దని.. నేనూ అలా అనగలనని…కానీ తనకో క్యారెక్టర్‌ ఉందంటూ ఘాటుగా రియాక్టయ్యారు దిల్‌ రాజు. నవాబ్, సర్కార్, పేట, సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని థియేటర్లు కావాలో అన్ని థియేటర్లలో వేసుకున్నారని.. అప్పుడు వేసుకున్న వారికి ఇపుడు థియేటర్లు దొరకడం లేదంటూ అనవసరమైన స్టేట్‌మెంట్లు ఇస్తున్నారంటూ దిల్‌ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : ఆడ శునకం కోసం మగ శునకం ఏం చేసిందంటే..

సంక్రాంతి బరిలో పేట మూవీతో పాటు ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9న విడుదల అవుతుండగా.. జనవరి 11 రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ, జనవరి 12న దిల్ రాజు ఎఫ్ 2 చిత్రాలు విడుదల అవుతున్నాయి. దీంతో ఈ బడా సినిమాలకు థియేటర్ల సమస్య ఏర్పడింది. ఈ నేపథ్యంలో పేట నిర్మాత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం టాలీవుడ్‌లో కలకలం రేపింది.

Recommended For You