ఆపద సమయాల్లో ఆర్థికంగా ఆదుకునే ఎమర్జెన్సీ ఫండ్

ఆపద సమయాల్లో మనకు ఆర్థికంగా చేయూత అవసరం అయినప్పుడు, ఎమర్జన్సీ ఫండ్ అనేది ఏర్పాటు చేసుకోవడం అనేది తప్పనిసరి. తమ సంపాదనలో కొంత భాగం మదుపు చేయడం ఉపయోగపడుతుంది. అయితే మ్యూచువల్ ఫండ్స్ అనేవి కేవలం దీర్ఘకాల మదుపు పథకాలు మాత్రమే కాదు వాటిని అత్యవసర వేళలో కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. వీటినే ఎమర్జన్సీ ఫండ్స్ అంటారు. 

ఎమర్జన్సీ ఫండ్‌నే కన్‌టిన్జెన్సీ నిధి అని కూడా అంటారు. అత్యవసర నిధికి మ్యూచువల్ ఫండ్స్ మంచి మార్గం. సాధారణంగా అత్యవసర సమయాల్లో రుణాలు తీసుకోవడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. లేదా సన్నిహితులు, మిత్రుల వద్ద అప్పుగా తీసుకోవడం సహజం. లిక్విడ్ లేదా అల్ట్రా షార్ట్ డెట్ ఫండ్స్ ఎమర్జన్సీ కింద ఉపయోగపడతాయి. వీటికి ఆర్థిక లక్ష్యం ఉంచాల్సిన అవసరం లేదు. ఈ ఫండ్స్ నుంచి అవసరమైనప్పుడు వెంటనే తీసుకునేందుకు వీటిలో వెసులుబాటు ఉంది. ఒకటి లేదా రెండు రోజుల్లో రిడీమ్ పద్ధతిలో పొందవచ్చు. బ్యాంకులో బదులు లిక్విడ్, అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే రాబడులు ఎక్కువగా అందుకోవచ్చు. సిప్ పద్ధతిలో ఈ ఫండ్స్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. 

అంతే కాదు మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, షార్ట్ టర్మ్‌లో రాబడి పొందాలనుకున్న వారికి అల్ట్రా షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్ మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. అలాగే వాహనాల కొనుగోలు, లేదా ఇతర విలువైన గ్రుహోపకరణాలు కొనుగోలు చేసేందుకు సైతం ఈ ఫండ్స్ బాసటగా నిలుస్తాయి. లిక్విడ్ ఫండ్స్ తో పోలిస్తే అల్ట్రా షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్స్, ఫండ్ మేనేజర్లకు మూలధన ప్రమాదం లేకుండా పోర్ట్ ఫోలియో ఏర్పాటు సౌలభ్యాన్ని అందిస్తాయి.


emergency fund using mutual funds