క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్

ipl
ipl

క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. తర్వాలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్‌ను మరో దేశంలో నిర్వహిస్తారన్న వార్తలకు బీసీసీఐచెక్ పెట్టంది.ఈ ఏడాది ఐపిఎల్‌ ఇండియాలోనే జరుగుతుందని స్పష్టం చెసింది. వినోద్ రాయ్, డయానా ఎడుల్జీల నేతృత్వంలోని సీఓఏ మంగళవారం ఢిల్లీలో సమావేశమైంది. కేంద్ర, వివిధ రాష్ట్రాల అధికారులతో చర్చించిన కమిటీ ఐపీఎల్ 12వ ఎడిషన్ ఇండియాలోనే నిర్వహించాలని నిర్ణయించినట్లుగా బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.మరిన్ని విస్తృత చర్చల అనంతరం పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేస్తామని తెలిపింది. 2009లో టోర్నీ సౌతాఫ్రికాలో జరగగా, ఆ తర్వాత 2014లో సగం టోర్నీ యూఏఈలో, మిగతా సగం భారత్ జరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూడా టోర్నీ విదేశాల్లో జరగనుందని వార్తలు వచ్చాయి. కానీ ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ టోర్నీ ఇండియాలోనే జరుగుతుందని కమిటీ నిర్ణయించింది. వరల్డ్ కప్,సార్వత్రిక ఎన్నికల కారణంగా మార్చి 23నే టోర్నీ ప్రారంభమవుతుందని బీసిసి తెలిపింది.