‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌లో నా పాత్ర ఎవరు చేశారంటే.. – బాలకృష్ణ

ntr, nbk, Jr NTR shout Jai Balayya, SS Rajamouli's son Karthikeya's wedding, Jai Balayya, Karthikeya wedding

దివంగత సీఎం నందమూరి తారకరామరావు బయోపిక్ ఎన్టీఆర్ కథనాయకుడు
జనవరి 9న విడుదల కానుంది. మూవీ ప్రమోషన్ లో బిజీగా ఉంది సినిమా యూనిట్. ఇందులోభాగంగా తిరుపతిలో పర్యటించిన బాలయ్య.. పీజీఆర్ మూవీ ల్యాండ్ లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అంతకుముందు ఎన్టీఆర్ సినిమా యూనిట్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. ఎన్టీఆర్ సీఎంగా తొలిసారి ప్రమాణస్వీకారం చేసింది కూడా జనవరి తొమ్మిదినే. అదే రోజున ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ అవుతుండటం విశేషం. ఈ మూవీలో ఎన్టీఆర్ గురించి చాలామంది తెలియని విషయాలు ఉన్నాయన్నారు హీరో బాలకృష్ణ.

Also Read : తెలుగు చిత్ర పరిశ్రమలో మరో వివాదం.. పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు.. : దిల్‌ రాజు

గౌతమిపుత్ర శాతకర్ణీ సినిమాతో తల్లి రుణం తీర్చుకున్నా తాను..ఎన్టీఆర్ కథానాయకుడితో తండ్రి రుణాన్ని తీర్చుకునే అవకాశం దక్కిందన్నారు బాలకృష్ణ. ఈ సినిమాలో అన్ని పాత్రలు చక్కగా వచ్చాయన్నారు. అయితే.. బాలకృష్ణ పాత్ర ఎవరు చేశారనేది మాత్రం చెప్పలేదాయన. మూవీ విడుదల వరకు సస్పెన్స్ అన్నారు.

జనవరి తొమ్మిదిన ఎన్టీఆర్ కథానాయకుడు విడుదల అవుతుండగా..రెండో భాగంగా కూడా శరవేగంగా పూర్తి అవుతున్నట్లు బాలకృష్ణ ప్రకటించారు. ఎన్టీఆర్ మహానాయకుడి పేరుతో సెకండ్ పార్ట్ రిలీజ్ చేస్తామన్నారు. ఎన్టీఆర్ కథానాయకుడు మూవీని డైరెక్టర్ క్రిష్ సినిమాను అద్భుతంగా తీర్చిద్దిద్దారని మూవీ యూనిట్ ప్రశంసించింది.

Also Read : ‘యన్‌.టి.ఆర్‌’ ఆడియో వేడుకను నిమ్మకూరులో అందుకే నిర్వహించలేదు : బాలయ్య

అటు బెంగళూరులోనూ ఎన్టీఆర్ బయోపిక్ మూవీ ప్రమోషన్ లో పాల్గొన్నారు బాలకృష్ణ. ఎన్టీఆర్ చేసిన పాత్రలన్నింటిని తాను ఒకే సినిమాలో చేసే అవకాశం రావటం అదృష్టం అన్నారు.