బీచ్‌లో భయపెడుతున్న జెల్లీఫిష్‌లు..

సరదా సాయంత్రాలను బీచ్‌లో గడుపుదామని వెళుతున్న బీచ్ ప్రియులను భయపెడుతున్నాయి జెల్లీఫిష్‌లు. చూడ్డానికి అందంగా ఉన్నాయి కానీ అవి కుడితే తెలుస్తోంది బాధ అని అంటున్నారు బీచ్‌కి వచ్చే పర్యాటకులు.

ఇక్కడి క్వీన్స్ ల్యాండ్ స్టేట్ సముద్ర తీరంలో వేలాది మందిపై దాడి చేస్తున్నాయి జెల్లీఫిష్‌లు. ఇది మా అడ్డా.. ఇక్కడికి మీరొస్తే మేమెలా ఊరుకుంటామని దాడి చేస్తున్నాయేమో. అయినా అంత పెద్ద సముద్రం ఎంతో మందికి ఆధారం కూడా. చేపలు పట్టే మత్స్యకారులు, ఎన్నో సముద్ర జీవులు అదే ఆధారంగా బతికేస్తుంటాయి.

అయితే ఇక్కడి సముద్రంలోని జెల్లీఫిష్‌లు మాత్రం 13వేల మందిని ఇవి కుట్టినట్లు తెలుస్తోంది. ఇవి కుడితే ప్రాణహాని కలగపోయినా చాలా నొప్పిగా ఉంటుందని పర్యాటకులు చెబుతున్నారు. బలమైన గాలుల కారణంగా సముద్రం అడుగు భాగాన ఉండే ఈ ఫిష్‌లు బయటకు వస్తున్నాయని అధికారులు వెల్లడించారు.

అధిక సంఖ్యలో ప్రజలు ఈ జెల్లీఫిష్‌ల వలన ఇబ్బందులు పడుతుండడంతో క్వీన్స్ ల్యాండ్‌లో పలు బీచ్‌లను మూసివేశారు. ఈ ఏడాది వీటి బారిన పడి 2,600 మంది ఆసుపత్రి పాలయ్యారని సర్ఫ్ లైఫ్ సేవింగ్ క్వీన్స్‌ల్యాండ్ అనే ఎన్జీవో వెల్లడించింది.