కీలక ఉగ్రవాద నేత హతం

US-Central-Command
US-Central-Command

అమెరికా వాయుసేన చేసిన దాడుల్లో ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థ ముఖ్యనాయకుడు చనిపోయినట్లు యూఎస్ మిలటరీ ప్రకటించింది. మారిబ్ గవర్నేట్ లో జరిగిన వైమానిక దాడుల్లో యెమెన్ లో అల్ ఖాయిదా కార్యకలాపాలు నిర్వహిస్తున్నజమాల్ అల్ బడావీ అనే ఉగ్రవాది మరణించినట్లు వెల్లడించింది. 2వేల సంవత్సరంలో అమెరికా నావికాదళ సిబ్బందిపై జరిగిన ఆత్మాహుతిదాడిలో బడావీ కీలకపాత్రపోషించాడు. ఈ దాడిలో దాదాపు 17మంది మరణించారు, 40మందికిపైగా గాయపడ్డారు. బడావీని అంతమొందించిన మిలటరీ అధికారులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందించారు.