నేను అనుకున్నది చేయడానికి ఏదైనా చేస్తా..

mexico-wall
mexico-wall

మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించాలని పట్టుదలతో ఉన్న అధ్యక్షుడు ట్రంప్ దక్షిణ సరిహద్దును సందర్శించేందుకు సన్నద్దమవుతున్నారు. అయితే దేశంలోకి చొరబాటుదారులను అడ్డుకునేందుకు తానుచేపట్టాల్సిన గోడ నిధులను ప్రతినిధుల సభ అడ్డుచెప్పడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశంలో మానవతా సంక్షోభం, జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకొని సరిహద్దును కొద్దిరోజుల్లో సందర్శించనున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే గోడ నిర్మాణానికి నిధులను ఇవ్వకపోతే దేశంలో అత్యవసర పరిస్థితిని విధించైనా నిర్మాణం పూర్తిచేస్తాన్న ప్రెసిడెంట్ వ్యాఖ్యల నేపధ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.