దారుణం: వ్యక్తిని కిరాతకంగా హత్య చేసి..

Man killed brutally
Man killed brutally
  • రాజన్న సిరిసిల్లా జిల్లా నర్సింగాపూర్ గ్రామంలో దారుణం
  • యువకుడ్ని హత్య చేసి బావిలో పడేసిన మరో గ్రామస్తుడు
  • భూవివాదమే హత్య కారణం అంటున్న గ్రామస్తులు
  • మృతదేహాంతో నిందితుడి ఇంట్లో బైఠాయించిన మృతుడి కుటుంబీకులు

రాజన్న సిరిసిల్లా జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.భూ వివాదం కారణంగా మెరుపుల హరీష్ అనే వ్యక్తిని కిరాతకంగా హత్య చేసి గ్రామంలోని బావిలో పడేశారు.మృతుడికి అదేగ్రామానికి చెందిన నెరళ్ళ సురేష్ అనే వ్యక్తితో భూవివాదాలున్నాయి.ఈ భూ వివామే హత్యకు దారితీసి ఉండవచ్చని గ్రామస్తులు చెబుతున్నారు.మృతుడి కుటుంబీకులు నిందితుడు సురేష్ ఇంటిపై దాడి చేసి నిప్పు పెట్టారు.మృత దేహాన్ని నిందితుడి ఇంట్లోకి తీసుకెళ్ళి బైఠాయించారు.ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.