అశ్రునయనాల మధ్య అయ్యప్ప భక్తుల అంత్యక్రియలు

ayyappa-devotees-from-medak-dead-in-tn-road-accident

కఠిన నియమాలు.. భక్తిశ్రద్ధలతో శబరీశుని దర్శనం చేసుకొని.. తిరిగి వస్తున్న అయ్యప్ప భక్తులను మృత్యువు కంబలించింది. మెదక్‌ జిల్లా వాసులను తమిళనాడులో రోడ్డు ప్రమాదం తొమ్మిది మంది మృతి చెందడంతో ఆ కుటుంబాలు దిక్కుతోచని వారయ్యారు. నర్సాపూర్‌ మండలంలోని కాజీపేట, మంతూరు, రెడ్డిపల్లి, చిన్నచింతకుంట గ్రామాలు శోకసంద్రమయ్యాయి. మృతుల ఇళ్లవద్ద విషాదఛాయలు అలుముకున్నాయి.

Also read : మహాకూటమి ఏర్పాట్లను ముమ్మరం చేసిన సీఎం చంద్రబాబు

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అయ్యప్ప భక్తుల మృతదేహాలకు వారివారి గ్రామాల్లో అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.. రోడ్డు ప్రమాదం వార్త తెలిసిన బంధువులు, మిత్రులు ఒక్కొక్కరుగా గ్రామాలకు తరలివచ్చారు.. కన్నీరుమున్నీరు అవుతున్న మృతుల కుటుంబీకులను ఓదార్చటం ఎవ్వరి తరం కాలేదు. కుటుంబ సభ్యులు, బంధువుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి..

శబరిమల నుంచి తిరిగివస్తూ ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదంలో కాజిపేట, మంతూరు, రెడ్డిపల్లి, చిన్నచింతకుంట గ్రామాలకు చెందిన నాగరాజుగౌడ్, బోయిని కుమార్, మహేశ్‌ యాదవ్, శివసాయిప్రసాద్, శ్యాంసుందర్‌గౌడ్, ఆంజనేయులు, కృష్ణాగౌడ్, సురేశ్, ప్రవీణ్‌గౌడ్‌లు మృతి చెందారు. వీరితోపాటు వాహన డ్రైవర్‌ సురేశ్‌ మృత్యువాతపడ్డాడు. వీరి మృతదేహాలు మంగళవారం నాలుగు గ్రామాలకు చేరుకోవడంలో శోకసంద్రంలో మునిగిపోయాయి బంధువులు.

మృతి చెందిన మృతుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి .. మృతుల కుటుంబాలను ప్రజాప్రతినిధులు పరామర్శించారు. త్వరలో సీఎం కేసీఆర్‌తో బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇప్పిస్తామని చెప్పారు.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో మృతదేహాలను తమిళనాడు నుంచి ప్రత్యేక అంబులెన్సుల్లో తీసుకొచ్చామన్నారు.

తమ వారు మృతి చెందడంతో తమ పరిస్థితి ఏం కానూ..’ అంటూ మృతుల కుటుంబీకులు కన్నీరు మున్నీరు అయ్యారు.. ఆగ్రామాల్లో నెలకొన్న విషాద చాయలు అందరినీ కలచి వేసింది. దేవుడిపై భక్తితో శబరిమలకు వెళ్తే. ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదు. విధి కక్ష కట్టిందంటూ ఆ కుటుంబాలు బోరున విలపించాయి.