చరిత్ర సృష్టించిన కోహ్లీసేనకు బీసీసీఐ భారీ నజరానా..

bcci-announces-cash-awards-for-triumphant-team-india-members

ఆస్ట్రేలియాలో చరిత్ర సృష్టించిన కోహ్లీసేనకు భారీ నజరానా ప్రకటించింది బీసీసీఐ. ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి నగదు బహుమతి ఇవ్వనుంది. దాదాపు 71 ఏళ్లకు టీమిండియా ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపైనే ఓడించి 2-1 తేడాతో టెస్టు సిరీస్‌ కైవసం చేసుకుంది. దిగ్గజ క్రికెటర్లకు సాధ్యం కాని లక్ష్యాన్ని సాధించింది. ఈ ఘనతకు నజరానా ఇవ్వాలని బీసీసీఐ కమిటీ నిర్ణయించింది.

Also read : క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్

మ్యాచ్‌ ఫీజ్‌కు సమానంగా బోనస్‌ ఇవ్వనుంది. ఒక్కో మ్యాచ్‌కు ఫీజు రూ.15 లక్షల వరకు ఉంటుంది. నాలుగు మ్యాచ్‌లు ఆడిన వారికి రూ.60 లక్షల వరకు బహుమానం దక్కనుంది. రిజర్వు ఆటగాళ్లకు మ్యాచ్‌కు రూ.7.5 లక్షలు ఇస్తారు. కోచ్‌లకు తలో రూ.25 లక్షలు ఇవ్వనున్నారు. సహాయక సిబ్బందికి ప్రొ రేటా వేతనం లేదా ప్రొఫెషనల్‌ ఫీజుకు సమానంగా బోనస్‌ అందిస్తారు. సుప్రీం కోర్టు నియమించిన పాలకుల కమిటీ ఇందుకు ఆమోదం తెలిపింది.