నకిలీ యాప్స్‌కి చెక్ పెట్టాలంటే.. ఈ అయిదు..

ఫలానా యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే మరిన్ని అవకాశాలు ఉచితంగా పొందవచ్చు. లేదంటే మీరు చేయవలసిందల్లా మీ మొబైల్‌లో ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే చాలు. ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంటాము అని మనల్ని టెంప్ట్ చేస్తుంటాయి ప్రకటనలు. ఇక వాళ్లు చెప్పిన వన్నీ చేసేస్తే ఆ తరువాత తీరిగ్గా బాధపడవలసి వస్తుంది. నిజానికి Google Play Store నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకున్నా ఇబ్బందే. ప్లే స్టోర్‌లో కూడా ప్రమాదకరమైన అనేక ఫేక్ యాప్స్ ఉంటున్నాయి.
ఈ క్రమంలోనే చాలా మంది ఒరిజనల్ యాప్‌కి బదులు ఫేక్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకుని ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. ఒకసారి నకిలీ యాప్ మన ఫోన్‌లోకి వచ్చిన తరువాత అదనంగా కమాండ్ కంట్రోల్ సర్వర్ నుండి .apkలను డౌన్లోడ్ చేయడంతో పాటు ఇతర ప్రమాదకరమైన స్క్రిప్ట్‌లను రన్ చేస్తుంటాయి. కాబట్టి ఏదైనా యాప్ డౌన్‌లోడ్ చేసుకునే ముందు ఈ టిప్స్ పాటించి చూడండి.

నకిలీ యాప్స్ డిస్క్రిప్షన్ రాసే విధానంలో చాలా లోపాలు ఉంటాయి. స్పెల్లింగ్ మిస్టేక్స్, ఫీచర్ల గురించి సరైన వివరణ లేకపోవడంతో పాటు గ్రామర్ పరంగా కూడా ఉన్న లోపాలను వెతికి పట్టుకోవచ్చు. దాన్ని బట్టి అది ఫేక్ యాప్ అని తెలిసిపోతుంది.
గూగుల్ ప్లే స్టోర్‌లో అప్ లోడ్ చేయబడే ప్రతి యాప్‌ను ఎవరు డెవలప్ చేశారు అనేది తెలియజేస్తూ డెవలపర్ పేరు స్పష్టంగా ఉంటుంది. ఆ పేరుని గూగుల్‌లో వెదికి ఆ డెవలపర్‌కి చెందిన అధికారిక వెబ్‌సైట్ పరిశీలించడం ద్వారా అతను పేరున్న డెవలపర్ అవునా కాదా అన్న విషయం తెలుసుకోవచ్చు.
యాప్‌కు ఉన్న రేటింగ్‌పై కూడా ఓ కన్నేసి ఉంచాలి. ఎందుకంటే నకిలీ యాప్స్‌కి రేటింగ్ చాలా తక్కువగా ఉంటుంది. ఒరిజినల్ యాప్స్‌కు రేటింగ్ ఎక్కువ ఉంటుంది.
థర్డ్ పార్టీ యాప్‌ స్టోర్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేయడం మానేస్తే మంచిది.
సెక్యూరిటీ నుంచి ఇంకా వైరస్ దాడుల నుంచి రక్షించుకునేందుకు మంచి యాంటీ వైరస్‌ను ఉపయోగించండి.