మంత్రి అఖిలప్రియ గన్‌మెన్‌లను తిప్పి పంపడంపై.. హోంమంత్రి స్పందన

home minister chinna rajappa responds on minister akhilapriya gun men withdraws

పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ తన గన్‌మెన్‌లను తిప్పి పంపడంపై హోంమంత్రి చినరాజప్ప స్పందించారు. పోలీసులు విధి నిర్వహణలో భాగంగా వాళ్ల పని వాళ్లు చేస్తారని… దీన్ని వివాదాస్పదం చేయడం సరికాదని అన్నారు. అఖిలప్రియకు ఏదైనా సమస్య ఉంటే పెద్దల దృష్టికి తెస్తే బాగుండేదన్నారు. ఈ వివాదాన్ని సీఎం చంద్రబాబే పరిష్కరిస్తారని చెప్పారు. కర్నూలు నగర శివారులోని రాయలసీమ వర్సిటీకి సమీపంలో నూతన పోలీస్ స్టేషన్‌ను మరో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో కలిసి చినరాజప్ప ప్రారంభించారు.

Recommended For You