ప్రేమలో పడిన స్టార్ హీరో.. త్వరలోనే ఆ హీరోయిన్ తో పెళ్లి

Arya,Sayyeshaa
Arya,Sayyeshaa

తమిళ నటుడు ఆర్య ప్రేమలోఉన్నారట. నటి సాయేషాతో ప్రేమలో ఉన్నట్లు కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరు త్యరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా సమాచారం. ఈ విషయంపై ఆర్య, సాయేషా మాత్రం స్పందించలేదు. మరో రెండు నెలల్లో ఇద్దరు నటులు పెళ్లి గురించి అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది.

గజినీకాంత్‌’ సినిమా కోసం ఆర్య, సాయేషా కలిసి పనిచేస్తున్న సమయంలో ఏర్పాడ్డ పరిచయం తర్వాత ప్రేమగా మారిందని అంటున్నారు. ప్రస్తుత్తం వీరిద్దరూ
దర్శకుడు కేవీ ఆనంద్ తెరకెక్కిస్తున్న‌ ‘కాప్పాన్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సెట్‌లో సాయేషా, ఆమె తల్లి.. ఆర్యను ప్రత్యేకంగా చూసుకుంటున్నారట. ప్రముఖ నటుడు దిలీప్‌ కుమార్‌, సైరా భానుల మనవరాలే సాయేషా. హిందీలో అజయ్‌ దేవగణ్‌ సినిమా ‘శివాయ్‌’లో తెలుగులో అఖిల్‌’ సినిమాలో సాయేషా నటించారు. అలాగే ‘వనమగన్’, ‘కడైకుట్టి సింగం’, ‘జుంగా’, ‘గజనీకాంత్‌’ లాంటి కోలీవుడ్‌లో చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.