ఎన్టీఆర్‌ ‘కథానాయకుడు’ ప్రేక్షకుల మాటేంటంటే..

ntr kathanayakudu movie

తెలుగునాట ఎన్టీయార్ బయోపిక్ సినిమా విడుదల సందడి కొనసాగుతోంది. అభిమానులు ఎన్నాళ్లో వేచిచూసిన ఈ చిత్రం ఇవాళ విడుదలైంది. సాగరతీరంలోనైతే సందడి అంతా ఇంతా కాదు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న చిత్రం నేడు విడుదల అయింది. కటౌట్లు, పోస్టుర్లు భారీ ఎత్తున సిద్దం చేశారు. థియేటర్ల వద్ద ముందే సంక్రాంతి వచ్చినంత సందడి కనిపిస్తోంది. చిత్రం రికార్డులు సృష్టించడం ఖాయమని తమ్ముళ్లు అంటున్నారు.

Also read : ‘కథానాయకుడు’.. జనం మెచ్చిన నాయకుడు: ట్విట్టర్ రివ్యూ

ఎన్టీఆర్‌ జీవితం ఎంతో మందికి ఆదర్శమని అంటున్నారు నందమూరి అభిమానులు. ఎన్టీఆర్‌ కథానాయకుడు సినిమాలో ఎన్టీఆర్‌ గురించి ప్రతీ అంశాన్ని చక్కగా తెరకెక్కించారని అంటున్నారు. ఎన్టీఆర్‌ కథానాయకుడు విడుదలైన థియేటర్స్‌ దగ్గర ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు విజయనగరంలోని నందమూరి ఫ్యాన్స్.

పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ థియేటర్స్ కి క్యూ కట్టారు. బాలయ్య ఎన్టీఆర్‌ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్లు ఉందని అంటున్నారు ఫ్యాన్స్‌. బాలయ్య తప్ప మరెవరు సినిమాకు న్యాయం చేయలేరని అంటున్నారు.

ఎన్టీఆర్ బయెపిక్ చూసేందుకు థియేటర్ల ముందు బారులు తీరారు జనం. తిరుపతిలో పీజీఆర్ థియేటర్‌ సందడి మరింత ఎక్కువగా కనిపిస్తోంది. మంగళవారం పీజీఆర్‌ ప్రాంగణంలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు బాలయ్య.

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్‌గా బాలయ్య నటన అద్భుతమంటున్నారు గుంటూరు జిల్లా అభిమానులు. ఈ చిత్రాన్ని చూసిన అభిమానులు విజయోత్సాహంలో ఉన్నారు.