‘యన్‌టిఆర్‌’ ప్రీమియర్‌ షో వసూళ్లు ఎంతంటే..

NTR-MOVIE
NTR-MOVIE

ఎన్టీఆర్ బయోఫిక్ కథానాయకుడు చిత్రం అమెరికాలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సందర్బంగా డల్లాస్ లోని హాలీవుడ్ దియేటర్ లో ఎన్టీఆర్, బాలకృష్ణ అభిమానులతో సందడి వాతావరణం నెలకొంది. సినిమా రిలీజ్ అయిన సందర్బంగా ధియేటర్‌కు చేరుకున్న ప్రవాస తెలుగువారు కేక్ కట్ చేసి నినాదాలు చేశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెపొందించిన నేత ఎన్టీఆర్ జీవిత చరిత్ర, సినిమాగా రావడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. బాలకృష్ణ నటన చాలా భాగుందని ఎన్నారై అభిమానులు కొనియాడారు. అయితే ఇప్పటివరకు నడిచిన షోలలో ‘యన్‌టిఆర్‌’ చిత్రం 4,40,000 డాలర్లు (రూ. 3,09,87,000) వసూళ్ళు రాబట్టినట్లు సమాచారం. గతంలో రీలిజైన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ప్రీమియర్‌ షో ద్వారా తొలి రోజు 3,75,000 డాలర్లు (రూ.2, 64,14,812) వసూళ్లు రాబట్టింది. దీంతో శాతకర్ణి’ ప్రీమియర్‌ షో వసూళ్లను ‘యన్‌టిఆర్‌’ చిత్రం బీట్‌ చేసినట్లైంది. గౌతమిపుత్ర శాతకర్ణి,యన్‌టిఆర్‌’ చిత్రానికి క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించారు.