ఆమె వయసు 32, అతని వయసు 24. ఆమెకు పెళ్లయి ఇద్దరు పిల్లలున్నా..

దారుణహత్యకు గురైన మహిళ సెల్వి నిందితుడు దౌలత్‌- ఫైల్
దారుణహత్యకు గురైన మహిళ సెల్వి నిందితుడు దౌలత్‌- ఫైల్

కర్ణాటకలో శనివారం జరిగిన హత్య మిస్టరీ విడింది. పోలీసులు విచారణలో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి.దుకాణంలో విధులు నిర్వహిస్తున్న సెల్వి అనే మహిళను గతవారం దారుణంగా చంపాడు ఓ యువకుడు. తర్వాత హత్య చేసిన కత్తి సహా పోలీసులకు లొంగిపోయాడు.ఈ సంఘటన కర్ణాటకలోని క్రిష్ణగిరి పట్టణంలో చోటుచేసుకుంది. హత్య ఘటనపై విచారించిన పోలీసులకు విచారణలో విస్తూపోయే నిజాలు వెలుగుచూశాయి. గౌండనూర్‌కొటాయ్‌ గ్రామానికి చెందిన సెల్వి భర్తతో వచ్చిన మనస్పార్థాల కారణంగా అతనికి దూరంగా ఉంటుంది. ఈమెకు ఇద్దరు పిల్లలు. వీరు కావేరిపట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి, 6వ తరగతి చదువుతున్నారు.

గతంలో సెల్వి ఓ దుస్తుల దుకాణంలో పనిచేస్తూ ఉండేది. ఈ సమయంలో దౌలత్‌ అనే యువకునితో పరిచయం ఏర్పాడింది. ఇది కాస్తా క్రమంగా వివాహేతర సంబంధంగా మారింది. కొద్దిరోజుల తర్వాత ఇద్దరి పనిస్థలాలు మారారు. అయినప్పటికీ వీరు తరచూ కలుస్తూ ఉండేవారు. అతని సంపాదన కూడా పూర్తిగా సెల్వి చేతికే ఇచ్చేవాడిని పొలీసులు తెలిపారు. ఈ క్రమంలో శనివారం రోజు దౌలత్‌కు పోన్ చేసిన సెల్వి రూ. 2 వేలు అవసరం ఉన్నాయని అడిగింది. దీంతో డబ్బులు తీసుకుని ఆమె పనిచేస్తున్న షాప్‌కు వచ్చాడు ఆ యువకుడు. ఈ సమయంలో సేల్వి మరోక్కరితో చలాకిగా ఫోన్‌లో మాట్లాడడం చూసి నిలదీశాడు. దీంతో ఆమె..నేను ఎవరితోనైనా మాట్లాడతాను నీకు ఎందుకంటూ ఎదురు సమాధానం ఇచ్చింది. సేల్వి సమాధానంతో ఆవేశానికి గురైన దౌలత్‌ దుకాణంలో విక్రయానికి ఉంచిన కత్తితో నరికి చంపాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు.