అమెజాన్ సీఈఓ సంచలన నిర్ణయం.. షాక్ కు గురైన ఉద్యోగులు..

amazon-founder-jeff-bezos-and-wife-divorcing-after-25-years

అమెజాన్ వ్యవస్థాకుడు, కంపెనీ సీఈఓ జెఫ్ బెజోస్‌(54) బుధవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన భార్య మెకెంజీ (48) తో విడాకులు తీసుకుంటున్నారు. తామిద్దరం పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్టు జెఫ్ బెజోస్‌ తన పేస్ బుక్ పేజీ లో పోస్ట్ చేశారు. పాతికేళ్లపాటు భార్యభర్తలుగా ఎంతో సంతోషంగా జీవించామనీ, కానీ కొన్ని కారణాలతో విడాకులు తీసుకుంటున్నాం.. అయితే తామిద్దరం విడిపోయినప్పటికీ స్నేహితులుగా కొనసాగుతామని ఆయన పేర్కొన్నారు.

Also read : సంచలన నిర్ణయం తీసుకున్న సివిల్స్‌ టాపర్‌

కాగా మెకెంజీ (48) ప్రతిభగల రచయిత్రి. 1993లో తన విద్యను పూర్తిచేసిన మెకెంజీ ఉద్యోగం కోసం న్యూయార్క్‌లోని ఓ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్లారు. ఆ సమయంలో జెఫ్ బెజోస్‌.. మెకెంజీని చూసి ప్రేమించారు. ఆ తరువాత ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు. మెకెంజీ రెండు నవలలు కూడా రాశారు. భర్తే తన రచనలకు, మొదటి బెస్ట్‌ రీడర్‌ అని ఆమె చెప్పేవారు. ఇదిలావుంటే 1994లో ఆన్‌లైన్ బుక్సెల్లర్‌గా ఏర్పాటైన అమెజాన్‌ ఆ తర్వాత అంచలంచెలుగా ఎదిగి.. ప్రపంచ దిగ్గజ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. రెండు రోజుల క్రితమే అమెజాన్‌ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. ఈ క్రమంలో సీఈఓ ఆయన భార్య తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు షాక్ కు గురయ్యారు. మరోవైపు జెఫ్ బెజోస్‌ ఓ ప్రముఖ టీవీ ఛానల్ రిపోర్టర్ తో చెట్టాపట్టాలు వేసుకు తిరుగుతున్నట్టు రూమర్లు హల్చల్ చేస్తున్నాయి.