విశాల్‌కి అమ్మాయి దొరికిందోచ్.. భాగ్యనగర భామే!!

తమిళ్ స్టార్ హీరో విశాల్‌కి పెళ్లి కళ వచ్చేసింది. అమ్మాయి దొరికేసింది. గత కొన్ని రోజులుగా విశాల్ పెళ్లి గురించి వస్తున్న వార్తలకు ఇంతటితో తెర పడినట్లే. స్టార్ హీరో, తమిళ్ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కి ప్రెసిడెంట్, నడిగర్ సంఘం సెక్రటరీ అయిన విశాల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. విశాల్ పెళ్లి వార్తను ఆయన తండ్రి జీకే రెడ్డి స్వయంగా వెల్లడించారు.

విశాల్ కూడా తన పెళ్లి వార్తను ప్రస్తావిస్తూ ఇది పెద్దలు కుదిర్చిన వివాహం కాదని, ప్రేమ వివాహమని తెలిపాడు. త్వరలోనే ఎంగేజ్‌మెంట్ జరగనుందని తెలిపాడు. వరలక్ష్మితో ప్రేమ, పెళ్లి అంటూ వచ్చిన వార్తలను ఇద్దరూ ఖండించారు. హైదరాబాద్‌కు చెందిన అనీషా అనే అమ్మాయితో తన జీవితాన్ని పంచుకోబోతున్నట్లు విశాల్ వివరించాడు. అనీషా విజయ్ రెడ్డి, పద్మజ దంపతుల ముద్దుల కుమార్తె అనీషా. విజయ్ రెడ్డి బిజినెస్ చేస్తున్నారు.