సంచలన నిర్ణయం తీసుకున్న సివిల్స్‌ టాపర్‌

kashmiri-ias-officer-shah-faesal-resigns-contest-lok-sabha-polls

జమ్మూ, కశ్మీర్‌కు చెందిన సివిల్స్‌ టాపర్‌, ప్రస్తుతం ఐఏఎస్‌ అధికారిగా కొనసాగుతున్న షా ఫజల్‌ బుధవారం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. దేశంలోని కొన్ని హిందుత్వ శక్తుల చేతుల్లో 20 కోట్ల భారతీయ ముస్లింలు వివక్షకు గురవుతున్నారని, వారిని కొంతకాలంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ‘ఆర్‌బీఐ, సీబీఐ, ఎన్‌ఐఏ తదితర ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేస్తూ రాజ్యాంగం ప్రసాదించిన గొప్ప కట్టడాన్ని సైతం కూలదోయాలని చూస్తున్నారు, దీన్ని ఆపాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. హత్యలకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Also read : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు

కాగా గతంలో కశ్మీర్‌లో జరుగుతున్న అత్యాచారాలపై ఓ ట్వీట్‌ చేసిన ఆయనపై జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ తర్వాత శిక్షణ కోసం విదేశాలకు వెళ్లి వచ్చిన ఫజల్‌.. పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. షా ఫజల్‌ 2009లో జరిగిన సివిల్‌ సర్వీస్‌ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించారు. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి కశ్మీరీగా షా ఫజల్‌ చరిత్ర సృష్టించారు. తన రాజీనామాకు గల కారణాలను ఆయన ఫేస్‌బుక్‌ పేజీలో వెల్లడించారు. ఇదిలావుంటే ఉద్యోగానికి రాజీనామా చేసిన ఫజల్.. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీలో చేరతారని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బారాముల్లా నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.