ఏపీ మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం

K.-Atchannaidu
K.-Atchannaidu
  • మంత్రి అచ్చెన్నాయుడికి తృటిలో తప్పిన ప్రమాదం
  • ఇచ్ఛాపురంలో కూలిన వైసీపీ కటౌట్
  • టీడీపీ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహిస్తుండగా ప్రమాదం
  • జన్మభూమి- మన ఊరులో భాగంగా బైక్ ర్యాలీ
  • మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు..
  • వెళ్లిన కొద్దిసేపటికే కుప్పకూలిన కటౌట్
  • ప్రమాదంలో ఐదుగురికి గాయాలు

మంత్రి అచ్చెన్నాయుడికి తృటిలో ప్రమాదం తప్పింది. ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సమయంలో ఏర్పాటు చేసిన భారీ కటౌట్ కుప్పకూలింది. ఇచ్ఛాపురంలో జన్మభూమి-మన ఊరు కార్యక్రమంలో భాగంగా టీడీపీ బైక్ ర్యాలీ నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే బెందాలం అశోక్ వెళ్లిన కొద్ది సేపటికే కటౌట్ రోడ్డుపై కూలింది. అయితే..ఈ ప్రమాదంలో ఐదుగురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. వారిని ఇచ్చాపురం ఆస్పత్రికి తరలించారు.