1 బంతికి 6 పరుగులు.. సిక్స్‌ కొట్టకుండానే గెలిచారు..

one-ball-6-runs-to-win-but-won-with-1-ball-to-spare

క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒక బంతికి ఆరుపరుగులు వచ్చాయి. కానీ సిక్స్ కొట్టలేదు. గతేడాది నిదహాస్‌ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తిక్‌ ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టి జట్టుకు విజయాన్నందించిన సంగతి క్రీడాభిమానులకు గుర్తుండే ఉంటుంది. అయితే అక్కడ సిక్స్ కొట్టి మ్యాచ్ ను గెలిపించాడు దినేష్ కార్తీక్. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం సిక్స్ కొట్టకుండా జట్టు విజయం సాధించింది. అయితే ఈ అరుదైన రికార్డ్ కు బౌలర్ బలయ్యాడు. అసలు విషయానికొస్తే.. మహారాష్ట్రలో ఆదర్శ్‌ క్రికెట్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో దేశాయ్- జుని డోంబివ్లి జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

Also read : ఎన్టీఆర్ ‘కధానాయకుడు’ ఓ అధ్బుతమైన చిత్రం : స్పీకర్ కోడెల

ఇందులో భాగంగా జుని జట్టుపై గెలవడానికి దేశాయ్‌కు 6 పరుగులు కావాల్సివచ్చింది. అప్పటివరకు దేశాయ్ జట్టు ఓటమి ఖాయమైంది. కానీ వారికి బౌలర్ రూపంలో అదృష్టం కలిసి వచ్చింది. మిగిలివున్న ఆఖరి బంతికి మొదటి బాల్‌ పడింది.. అది కాస్త వైడ్‌. రెండో బంతి పడింది అది కూడా వైడ్‌ అలా వరుసగా ఆరు వైడ్లు పడ్డాయి. దాంతో ఆఖరు బంతి ఆడకుండానే ఆరు పరుగులు దేశాయ్‌ జట్టుకు లభించాయి దాంతో మరో బంతి మిగిలి ఉండగానే జుని జట్టుపై దేశాయ్‌ జట్టు విజయం సాధించింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో కొడుతోంది. దీనిపై నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్లు పెడుతున్నారు.