నెల రోజుల క్రితమే కూతురు పెళ్లైంది..అంతలోనే..

singareni-worker-dies-in-road-accident
singareni-worker-dies-in-road-accident

రోడ్డు ప్రమాదంలో సింగిరేణి ఉద్యోగి మృతి చెందారు. వెలుగుతున్న విద్యుత్ దీపాలను ఆర్పేందుకు వెళ్లి ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ సంఘటన రామగుండంలోని రెండో డివిజన్‌ పరిధిలోని ఓసీపీ-3 ప్రాజెక్ట్‌లో చోటుచేసుకుంది. జవహర్‌నగర్‌కి చెందిన ఎలగం రాజ్‌కుమార్ ఓసీపీ-3 ప్రాజెక్టులోని ఫేజ్‌-2 సీహెచ్‌పీలో ఎలక్ట్రీషియన్‌గా పనిస్తున్నారు. రాత్రి పూట విధులు ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో వెలుగుతున్న లైట్లను ఆర్పేందుకు సీహెచ్‌పీ షెడ్‌ నుంచి రోడ్డుకు మరో వైపున ఉన్న స్విచ్‌ల వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న స్విచ్‌ను ఆఫ్‌ చేసి తిరిగి రోడ్డు దాటుతున్నసమయంలో వేగంగా వస్తున్న లారీ రాజ్‌కుమార్‌ను ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

మృతునికి భార్య,ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రాజ్‌కుమార్ ప్రమాదంలో మృతి చెందడంతో భార్యా పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు.నెల రోజుల క్రితం పెద్ద కూతురు వివాహం చేశారు. రాజ్‌కుమార్‌ మృతదేహాన్ని గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఆసుపత్రి వద్దకు చేరుకొని మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.