సర్పంచ్‌‌గా పోటీ చేయి..మాకు రూ5 లక్షల ఇవ్వు ..లేకపోతే..

Man-Attempts-Suicide
Man-Attempts-Suicide
  • జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం ఓబులాపూర్‌ తండాలో.. ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పంచాయతీ ఎన్నికలు
  • సర్పంచ్‌గా పోటీ చేయాలని, తమకు 5 లక్షలు ఇవ్వాలి
  • భూక్య దేవదాసు అనే వ్యక్తిని బెదిరించిన తండాలోని కొందరు వ్యక్తులు
  • మనస్తాపంతో గుళికల మందు తాగి ఆత్మహత్యాయత్నం
  • ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దేవదాసు

ఓ తండాలో పంచాయతీ ఎన్నికలు ఆత్మహత్యాయత్నానికి దారి తీశాయి. గ్రామంలోని కొందరి వేధింపులు భరించలేక ఆత్మహత్యయత్నం చేశాడో వ్యక్తి. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం ఓబులాపూర్‌ తండాకు చెందిన భూక్య దేవదాసు.. గత ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయాడు. అయితే ఈ సారి కూడా సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేయాలని…ఇందు కోసం తమకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని గ్రామంలో కొందరు వ్యక్తులు బెదిరింపులకు దిగారు. దీంతో వారి హెచ్చరికలకు భయపడిపోయిన దేవదాసు రెండు లక్షలు ఇచ్చాడు. అంతటితో ఆగకుండా మరో 3 లక్షలు ఇవ్వాలని బెదిరించారు. దీంతో మనస్తాపం చెందిన దేవదాసు.. గుళికల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు.

అతని పరిస్థితి విషమంగా మారడంతో…స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఐదుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు.