దొంగతనం కేసులో సాక్ష్యం చెబుతానన్న మహిళ సూసైడ్‌

women suicide in sangareddy distric

దొంగతనం జరిగింది… తాను సాక్ష్యం అని చెబుతానన్న ఆ ధీర మహిళ సూసైడ్‌ చేసుకోవడం సంచలనం రేపుతోంది… సాక్ష్యం చెబుతానన్నందుకే ఆమె ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది… సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం తేర్పోల్‌ గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది…. పిల్లలకు ఆ తల్లిని దూరం చేసింది… ఆ కుటుంబాన్ని కకావికలం చేసింది…

Also read : ముగిసిన పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం

తేర్పోల్‌ గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో డిసెంబర్‌ 18 రాత్రి చోరీ జరిగింది… ఆలయంలో పెద్ద శబ్దం వినిపించింది.. తెల్లవారితే వైకుంఠ ఏకాదశి… ఏర్పాట్లు జరుగుతున్నాయేమోనని కిటికీ నుంచి ఆలయం వైపు చూసింది పటోళ్ల సుధ… జరుగుతున్నది ఏర్పాట్లు కాదు.. దొంగతనం అని పసిగట్టింది… నలుగురు దొంగలు ఆలయంలో చోరీ చేస్తున్నారు… సమయానికి ఫోన్‌లో బ్యాలెన్స్‌ లేదు… భర్త రామకృష్ణారెడ్డి రాత్రి విధులకు వెళ్లాడు… ఇద్దరు పిల్లలు, సుధ మాత్రమే ఇంట్లో ఉన్నారు… తెల్లవారిన తర్వాత జరిగిన విషయాన్ని గ్రామస్థులకు, పోలీసులకూ చెప్పింది… కానీ అదే తన ప్రాణం తీస్తుందని గ్రహించలేకపోయింది…

దొంగలను గుర్తుపడుతానని చెప్పిన పాపానికి సుధకు ఇబ్బందులు మొదలయ్యాయి… విచారణ పేరుతో పోలీసులు తరచూ ఇంటికి రావడం… అడిగినదే పదిసార్లు అడగడంతో సుధ తీవ్ర ఆవేదనకు గురైంది… అంతేకాదు ఓ దొంగను ఇంటికి తీసుకొచ్చి గుర్తు పట్టాలని పోలీసులు కోరారు… దొంగకు తన ఇళ్లు తెలిసిపోయిందని సుధ ఆందోళన గురైంది.. అలాగే చుట్టుపక్కల వారు.. బంధువులు సైతం ఆమెను భయపెట్టారు… తన వల్ల పిల్లలకు ఏమైనా జరుగుతుందని భయపడ్డ సుధ చివరకు ఆత్మహత్యకు పాల్పడింది…

పోలీసులు తరచూ రావడం వల్లే ఒత్తిడికి గురైన సుధ ఆత్మహత్యకు పాల్పడిందని గ్రామస్థులు చెబుతున్నారు…. గుడిలో దొంగలు పడి మూడు కిలోల వెండి, హుండీలోని డబ్బులు కాజేశారు… కానీ సాక్ష్యం చెప్పిన పాపానికి సుధ ప్రాణం తీసుకుంది… తను చనిపోతే కుటుంబానికి ఇబ్బంది ఉండదనుకుంది… చివరకు పిల్లలను రోడ్డుపాలు చేసింది.. పోలీసులు మాత్రం ఆమెకు ఇబ్బంది కలిగేలా వ్యవహరించలేదని… ఆమె మృతికి ఇతర కారణాలేమైనా ఉండవచ్చని బుకాయిస్తున్నారు.