3 గంటల్లోనే కొండపైకి..

jagan-at-Tirumala
jagan-at-Tirumala

వైసీపీ అధ్యక్షుడు జగన్ అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరుకొని… శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కాలినడకన జగన్‌ 3 గంటల్లోనే కొండపైకి చేరుకున్నారు. జగన్ వెంట పెద్దసంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. దివ్యదర్శనం క్యూలైన్‌ ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన జగన్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రాత్రికి శారదాపీఠంలోనే జగన్ బస చేయనున్నారు. పీఠాధిపతి స్వరూపానంద స్వామిని కలిసి ఆశీర్వాదం తీసుకోనున్నారు. రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్ ఘాట్‌లో జగన్ నివాళులర్పించనున్నారు.