కేసీఆర్‌ సహస్ర చండీ యాగం..పాల్గొనున్న 200 మంది రుత్వికులు

సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఎప్పుడు చేసినా ఆయనకు బాగా కలిసొస్తోందన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ… మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో ఆయన… ఈ నెల 21 నుంచి 25 వరకు మహా రుద్ర సహిత సహస్ర చండీ యాగం చెయ్యబోతున్నారు. 21 నుంచీ జరిగే యాగంలో 200 మంది రుత్వికులు పాల్గొంటారు.