ఇవాళ్టి నుంచి పంచాయతీ రెండో విడత నామినేషన్ల స్వీకరణ

telangana panchayith election

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం జోరుగా సాగుతుంది. ఆశావాహులు భారీగా బరిలో నిలుస్తున్నారు. మూడు దశలలో పంచాయతీ ఎన్నికలు జరగనుండగా..ఇవాళ్టి నుంచి రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభంకానుంది. రెండో దశలో 4వేల 137 పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 172 మండలాల్లో కొనసాగనున్న రెండో విడతలో 36,620 వార్డులకు కూడా నామినేషన్లు స్వీకరిస్తారు. ఇవాళ్టి నుంచి 13వ తేదీ వరకు నామినేషన్ల పర్వం కొనసాగనుంది. ఈ విడతకు 25వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.