మూడు రోజుల పాటు నిద్ర లేకుండా ఉండాలనుకుంటున్నారా!..అయితే

drug-peddler

డబ్ల్యూవై,యాబా ఇదేంటి కొత్త ఉన్నాయి ఈ పేర్లు అనుకుంటన్నారా..ఇవి మాదకద్రవ్యాల పేర్లు మయన్మార్,ధాయ్ లాండ్ దేశాల్లో వీటిని తయారు చేస్తారు.అక్కడ నుంచి కొరియర్ వచ్చే ఈ డ్రగ్స్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ లో గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.

మయన్మార్ కు చెందిన అబిబాస్ రెహ్మాన్,మహ్మద్ రహీం లు అక్రమంగా భారతదేశంలోకి రోహింగ్యాలుగా ప్రవేశించి బాలాపూర్ కార్పెంటర్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.మయన్మార్ లో స్నేహితుడు సలీంతో అక్కడ డ్రగ్స్ విక్రయిస్తుండే వాడు.అయితే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని రెహ్మాన్,రహీంలు సలీంతో మయన్మార్ నుంచి కొరియర్ ద్వారా హైదరాబాద్ కి డ్రగ్స్ తెప్పించి ఇక్కడ విక్రయించేవారు.

అయితే ఈ డ్రగ్స్ ట్యాబ్ లెట్ రూపంలో ఉండడంతో ఏవరికి అనుమానం రాకుండా వ్యాపారం బాగానే సాగింది.ఒక్కోక్క ప్యాకెట్ లో 200 వందల యాబాట్యాబ్ లెట్లు ఉంటాయి..ఒక్క ట్యాబ్ లెట్ ను 200 రూపాయల చోప్పున అమ్మేవారు.వీరిద్దరి పై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు ఈ రోజు ఉదయం బాలాపూర్ లో రెహ్మాన్,రహీం లను అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి 1330 వందల ట్యాబ్ లెట్ లు సీజ్ చేశారు.వీరి దగ్గర NDPS యాక్ట్ కింది కేసు నమోదు చేసి రెండు మోబైల్ ఫోన్ లతో పాటు దొంగ ఆధార్ కార్డును స్వాధీనం చేసుకున్నారు.

అయితే ఇలాంటి వారి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.ITఉద్యోగలు,విద్యార్దులను టార్గట్ చేసుకుని వీరి విక్రయాలు చేస్తున్నరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Recommended For You