ఏపీ ప్రజలకు చంద్రబాబు వరాల జల్లు.. జనవరిలో రూ.3,000, ఫిబ్రవరి నుంచి రూ.2000 పెన్షన్

today cm chandrababu naidu schedule
  • పెన్షన్ 1000 నుండి 2000 కి పెంచుతూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి
  • యన్టీఆర్ వైద్యకార్చులు క్రింద 5 లక్షలు మంజూరు చేస్తున్నాము
  • జన్మభూమిలో వచ్చే అర్జీల్లో అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తన్నాము
  • పంచాయతీ అధ్యక్షులుగా చేసిన అనుభవం లేని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి బడ్జట్ అంటే అర్థం తెలుసా
  • కృష్ణ గోదావరి అనుసందలాగా.. గోదావరి పెన్నా నదుల అనుసంధానం చేసి సోమశిల నీరు చేరుస్తాము..
  • కేంద్రం అవార్డులు ఇస్తుంది కానీ.. డబ్బులు ఇవ్వడంలేదు
  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెట్టుబడులు పెట్టేవారు వెనక్కుపోతారు
  • ఎంతోమంది అధికారులి, నాయకులు జగన్ను నమ్ముకొని జైళ్ల పాలు ఐయ్యారు
  • రాబోయే రోజుల్లో ఇంటికి ఒక స్మార్ట్ ఫోన్ అందించనున్నాము
  • కేంద్రం అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది..

సంక్రాంతికి పెద్ద కానుక ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు. పించన్లు 2 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. ఇంకా చాలా ఇవ్వాలని తన మనసులో ఉన్నా.. ఖజనా లేకపోవడం బాధకలిస్తోందన్నారు.. మరోవైపు కేంద్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ప్రధాని మోడీ నియంతలా వ్యవహరిస్తూ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే ప్రతిపక్ష నేత జగన్‌పైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పొరపాటున వైసీపీ అధికారంలోకి వస్తే.. రాష్ట్రానికి పెట్టుబడులు రావని ఆవేదన వ్యక్తం చేశారు..

ఏపీ ప్రజలకు న్యూఇయర్, సంక్రాంతి గిఫ్ట్ ప్రకటించారు ముఖ్యమంత్రి. నెల్లూరు జిల్లాలో జరిగిన జన్మభూమి – మన ఊరు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. వృద్ధులు, పేదలపై వరాల జల్లు కురిపించారు. ఫిబ్రవరి నుంచి ఫించన్ల‌ను డబుల్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంకా చాలా చేయాలని ఉందని, కానీ ఖజనా సహకరించడం లేదన్నారు. అలాగే మోడీ, జగన్‌లపై నిప్పులు చెరిగారు.

సంక్షేమంపై ఫోకస్‌ పెంచారు ఏపీ సీఎం. ఇప్పటికే పేదల కోసం పలు పథకాలు ప్రవేశపెట్టిన ఆయన.. ఇప్పుడు ప్రజలకు సంక్రాంతి కానుక ప్రకటించారు. ప్రస్తుతం ఏపీలో ఇస్తున్న 1000 రూపాయల పించన్లను.. రెండు వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు జిల్లా బోగోలు జన్మభూమి సభలో సీఎం ఈ ప్రకటన చేశారు. జనవరి నుంచే పెంచిన పించన్‌ను చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు న్యూ ఇయర్‌ కానుకగా ఈ నెల 3వేలు అందిస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. (BABU
పేద ప్రజల సంక్షేమం కోసం ఇంకా చాలా చేయాలని మనసులో ఉందన్నారు సీఎం. రాష్ట్ర ప్రభుత్వానికి ఖజనా లేకపోవడంతో వెనుకడుగు వేయాల్సి వస్తోందన్నారు. పాలనలో అనుభవం లేని.. అసలు బడ్జెట్‌ అంటే ఏంటో తెలీని వాళ్లు తనను విమర్శిస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు..

మోడీ డిక్టేటర్‌లా మారారంటూ మరోసారి మండిపడ్డారు సీఎం. విభజన హామీలు నెరవేర్చాలని కోరితే.. నమ్మకద్రోహం చేశారని గుర్తుచేశారు. వ్యవస్థలన్నిటినీ భ్రష్టుపట్టించారని.. నిలదీసిన వారిపై సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.

ప్రపంచమంతా తిరుగుతూ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని.. తనపై నమ్మకంతోనే ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని గుర్తు చేశారు. పొరపాటున వైసీపీ అధికారంలోకి వస్తే.. పారిశ్రామిక వేత్తలు భయపడతారని, పెట్టుబడులు రావని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

పోలవరం పనులు పరుగులు పెడుతున్నాయని చంద్రబాబు గుర్తు చేశారు. కేంద్రం సహకరించకున్నా 64 శాతం పనులు పూర్తి చేశామన్నారు. మే నాటికి గ్రావిటీతో నీళ్లు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు..

గత ఎన్నికల్లో నెల్లూరు ప్రజలు పది స్థానాల్లో మూడు చోటే తమను గెలిపించారని.. అయినా వివక్ష చూపించలేదన్నారు. ఈసారి కచ్చితంగా టీడీపీ వెంటే ఉంటారని ఆకాంక్షించారు. అంతకుముందు చిప్పలేరుపై 25 కోట్లతో నిర్మించిన వంతెనను ప్రారంభించారు. అక్కడి నుంచి చిప్పలేరు సముద్రంలో కలిసే ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చిప్పలేరు తీరప్రాంత మత్స్యకారులు పడవలద్వారా ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.

Recommended For You