నర్సు నిర్లక్ష్యం.. రెండు ముక్కలుగా శిశువు

baby split half head left womb during delivery

మేల్ నర్సు నిర్వాకంతో లోకం చూడకుండానే ఓ శిశువు తల్లి గర్భంలోనే మృతిచెందింది. నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచిన ఈ ఉదంతం రాజస్థాన్‌లో వెలుగు చూసింది. జైసల్మేర్‌లోని రాంగఢ్‌ ప్రాంతానికి చెందిన దీక్షా కన్వర్‌ గర్భిణీ. పురిటినొప్పులతో బుధవారం రాంగఢ్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేరింది. ప్రసవ సమయంలో మేల్ నర్సు శిశువును బలవంతంగా లాగాడు. దాంతో శిశువు శరీరం రెండు భాగాలుగా విడిపోయింది. రెండు కాళ్ళు బయటకు రాగా తలభాగం మాత్రం గర్భంలోనే ఉండిపోయింది. భయాందోళన చెందిన నర్సు.. మృత శిశువు జన్మించిందని.. లోపల మాయ అలాగే ఉండిపోయిందంటూ కుటుంబసభ్యులను నమ్మించాడు. దాంతో వారు మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు అసలు విషయాన్ని గుర్తించి, కుటుంబసభ్యులకు పరిస్థితి వివరించారు. ఆపరేషన్‌ చేసి శిశవు తలను బయటకు తీసి తల్లిని రక్షించారు. ఈ ఘటనతో హతాశురాలైన తల్లి.. నర్సుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.