టీడీపీ, వైసీపీ నేతలు సవాళ్లు.. వైసీపీ నేతలను బయటకు పంపించి..

clash between tdp and ycp in vuyyuru

కృష్ణా జిల్లా ఉయ్యూరు జన్మభూమి రసాభాసగా ముగిసింది. టీడీపీ, వైసీపీ నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. ఇక వారి అనుచరులు తోసుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. చంద్రబాబు ప్రభుత్వం చేసిన అభివృద్ధిని టీడీపీ నేతలు వివరిస్తుండగా.. వైసీపీ నేత పార్థసారథి అనుచరులు అడ్డుకున్నారు. వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజుల పాటి రామచంద్ర రావు ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ ను దూషించడంతో వివాదం చినికి చినికి గాలి వానలా మారింది. ఆగ్రహంతో ఊగిపోయిన టీడీపీ శ్రేణులు.. వైసీపీ కార్యకర్తలతో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ వైసీపీ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మరింత అగ్గి రాజేసాయి. పోలీసులు వైసీపీ నేతలను బయటకు పంపించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.