నా పాత్ర బాగా తీశారు : సీఎం చంద్రబాబు

cm-chandrababu-naidu-watches-ntr-kathanayakudu-movie
cm-chandrababu-naidu-watches-ntr-kathanayakudu-movie

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాను చంద్రబాబు వీక్షించారు. విజయవాడలోని ట్రెండ్ సెట్ మాల్‌లో సినిమా చూశారు.చరిత్రలో నిలిచిపోయేలా అద్భుతంగా సినిమాను తీశారని చిత్ర యూనిట్‌ను ప్రశంసించారు. ఎన్టీఆర్ మళ్లీ వచ్చి సినిమా చేశాడా అనే విధంగా బాలకృష్ణ నటించారని బాలక్రిష్ణకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. వాస్తవికతకు సినిమా దగ్గరగా ఉందని… తన పాత్ర కూడా బాగా తీశారన్నారు.

Also read : ఇవాళ్టి నుంచి పంచాయతీ రెండో విడత నామినేషన్ల స్వీకరణ

ఎన్టీఆర్ లాంటి మహనీయుడి జీవితాన్ని అద్భుతంగా తీశారని ప్రత్యేకంగా డైరెక్టర్ క్రిష్‌ను చంద్రబాబు అభినందించారు. సినిమాకు ముందుకు బాలక్రిష్ణ, ఎన్టీఆర్‌ లా చేయగలడా లేదా అని అనుకున్నానని.. కానీ బాగా నటించారన్నారు. అంతకు ముందుకు సినిమా‌ మాల్‌లో చంద్రబాబుకు నటుడు బాలయ్య, డైరెక్టర్ , పొలిటికల్ లీడర్స్ స్వాగతం పలికారు. వారితో కలిసి చంద్రబాబు సినిమా చూశారు. ఇప్పటికే రాజకీయ నాయకులు, ప్రముఖుల నుంచి సినిమాకు అభినందనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.