ముహూర్తం ఖరారు..మహిళకు అవకాశం

astronauts

అంతరిక్షయానానికి ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 2021 నాటికి ముగ్గురు భారత వ్యోమగాములు అంతరిక్షయానం చేయనున్నారు. ఏడు రోజులపాటు అంతరిక్షంలో ఉండి తిరిగి భూమికి చేరేలా ఇస్రో… గగన్‌ యాన్‌ చేపట్టబోతోంది. ఈ విషయాన్ని ఇస్రో చీఫ్ శివన్ నిర్దారించారు. గగన్‌యాన్‌ పనులు కూడా ప్రారంభమైనట్లు శివన్ వెల్లడించారు. ఈ మిషన్ పూర్తయితే భారత్‌ నుంచి మానవ సహిత అంతరిక్షయానంగా రికార్డులకు ఎక్కనుంది.

ముగ్గురు వ్యోమగాముల్లో మహిళలకు కూడా అవకాశం కల్పించనున్నారు. వీరికి మొదట మన దేశంలో, ఆ తర్వాత రష్యాలో అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ మిషన్ కోసం కేంద్ర ప్రభుత్వం 10 వేల కోట్లు కేటాయించింది.

మానవ సహిత అంతరిక్ష యానానికి కేంద్ర క్యాబినెట్ గత డిసెంబర్‌లోనే ఆమోదముద్ర వేసింది. అంతేకాదు దీని కోసం 2022 వరకు డెడ్‌లైన్ విధించింది. అయితే ఇస్రో మాత్రం దీనికంటే ముందుగానే అంటే డిసెంబర్ 2021 నాటికి గగన్‌యాన్‌ను స్పేస్‌లోకి పంపడానికి పనులు ప్రారంభించింది.

Recommended For You