షోకి వెళ్లి… అడ్డంగా బుక్కయ్యారు

hardik-pandya
hardik-pandya

ఒక టీవీ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు భారత క్రికెటర్లు హార్థిక్ పాండ్యా , కెఎల్ రాహుల్ భారీ మూల్యం చెల్లించుకోనున్నారు. వీరిద్దరిపై రెండు మ్యాచ్‌ల వరకూ నిషేధం వేటు పడే అవకాశం కనిపిస్తోంది. కాఫీ విత్ కరణ్‌ టీవీ షోలో పాండ్యా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. సోషల్ మీడియాతో పాటు మాజీ క్రికెటర్లు దీనిపై విమర్శలు గుప్పించారు. వివాదం పెద్దదవడంతో వివరణ ఇవ్వాలని బీసిసిఐ ఇద్దరినీ ఆదేశించింది. అలాగే ఈ వివాదంపై పూర్తి విచారణ జరపడం కోసం ఆరుగురు సభ్యులతో కూడిన విచారణ బృందాన్ని ఏర్పాలు చేసింది. తాను చేసిన వ్యాఖ్యలపై పాండ్యా అపాలజీ చెప్పినప్పటకీ.. బోర్డ్ సంతృప్తి చెందలేదని సమాచారం. వీరిపై నిషేదం విధించాలని సివొఎ సభ్యురాలు డయానా ఎడుల్జీ కమిటీని కోరింది. దీనిపై సివొఓ ఇవాళ తుది నిర్ణయం తీసుకోనుంది.

జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న ఆటగాళ్ళు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సరికాదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. బాధ్యాతయుతంగా వ్యవహరించకుండా ఇలా మాట్లాడడం తప్పుడు సంకేతాలు పంపిస్తుందని వ్యాఖ్యానించారు. కాగా రేపు ఆస్ట్రేలియాతో తొలి వన్డే జరగనున్న నేపథ్యంలో ఈ వివాదం ఖచ్చితంగా భారత్‌కు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. జట్టులో కొనసాగించకుండా వీరిద్దరినీ వెంటనే స్వదేశానికి పిలిపించాలని బోర్డ్ భావస్తోన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కెప్టెన్ కోహ్లీ ఈ వివాదంపై ప్రకటన చేశాడు. మహిళలను అగౌరవ పరిచే ఎటువంటి వ్యాఖ్యలను తాము సమర్థింమని, పాండ్యా , రాహుల్ వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమన్నాడు. వారి వ్యాఖ్యలతో జట్టుకు ఎటువంటి సంబంధం లేదని చెప్పాడు.