బీసీసీఐ సంచలన నిర్ణయం

Hardik Pandya, KL Rahul
Hardik Pandya, KL Rahul
  • పాండ్యా, రాహుల్‌ను సస్పెండ్ చేసిన బీసీసీఐ
  • మహిళల పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన అవమానించినందుకు బీసీసీఐ కఠిన నిర్ణయం
  • ఆస్ట్రేలియా పర్యటన నుంచి ఇంటిముఖం పట్టిన పాండ్యా, కేఎల్ రాహుల్
  • ఓ టీవీ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ కఠిన నిర్ణయం

బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. పాండ్యా, రాహుల్‌ను టీం నుంచి సస్పెండ్ చెసింది. మహిళల పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసనందుకు గాను బీసీసీఐ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. కాఫీ విత్ కరణ్ షోలో మహిళలపై పాండ్యా, రాహుల్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా వీరిని రెండు వన్డేల నిషేధానికి సీఓఏ చైర్మన్ వినోద్ రాయ్ సిఫారసు చేసిన విషయం తెలిసిందే.దీంతో ఆస్ట్రేలియా పర్యటన నుంచి పాండ్యా, కేఎల్ రాహుల్ ఇంటిముఖం పట్టనున్నారు.