క్రికెటర్లమనే అహంకారం..నోటి దురుసు ప్రదర్శన..చివరకి అదే..

Hardik-Pandya,-KL-Rahul
Hardik-Pandya,-KL-Rahul

అంతర్జాతీయ క్రికెటర్లమనే అహంకారం దెబ్బకొట్టింది. నోటి దురుసు ప్రదర్శించిన రాహుల్, హర్ధిక్ పాండ్యాలపై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో ఆస్ట్రేలియాతో శనివారం నుంచి ప్రారంభం అయ్యే వన్డే సిరీస్ కు దూరం కానున్నారు.

ఒక టీవీ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు భారత క్రికెటర్లు హార్థిక్ పాండ్యా , కెఎల్ రాహుల్ భారీ మూల్యం చెల్లించుకున్నారు.
మహిళలను కించపరిచేలా మాట్లాడిన క్రికెటర్లు క్లీన్ బౌల్డ్ అయ్యారు. పురుష అహాంకారాన్ని ప్రదర్శించిన ఇంటర్నెషనల్ క్రికెటర్స్ హర్ధిక్ పాండ్యా, రాహుల్ పై వేటు వేసింది బీసీసీఐ. ప్రతిభతో పాటు విచక్షణ, క్రమశిక్షణ కూడా ముఖ్యమేనని చాటింది.
స్పాట్ః

కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాంలో పాండ్యా చేసిన వ్యాఖ్యలు ఈ దుమారానికి కారణం అయ్యాయి. సోషల్ మీడియాతో పాటు మాజీ క్రికెటర్లు దీనిపై విమర్శలు గుప్పించారు. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న ఆటగాళ్ళు విచ్చలవిడి వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సరికాదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
బైట్ః

పాండ్యా కామెంట్స్ పై విమర్శల దాడి పెరిగిపోవటంతో టీమిండియా కెప్టెన్ కోహ్లీ కూడా వివాదంపై స్పందించాడు. మహిళలను అగౌరవ పరిచే ఎలాంటి వ్యాఖ్యలను తాము సమర్థించబోమని, పాండ్యా , రాహుల్ కామెంట్స్‌ వారి వ్యక్తిగతమని కోహ్లీ చెప్పాడు. వారి వ్యాఖ్యలతో జట్టుకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టంచేశాడు. అయితే..ఆటగాళ్లు బాధ్యతయుతంగా మసలుకోవాలన్నాడు.
బైట్ః కోహ్లీ

వివాదం పెద్దదవడంతో తొలిగా వివరణ ఇవ్వాలని బీసిసిఐ ఇద్దరినీ ఆదేశించింది. తాను చేసిన వ్యాఖ్యలపై పాండ్యా క్షమాపణలు చెప్పినప్పటకీ.. బోర్డ్ సంతృప్తి చెందలేదు. సివొఓ వేటు వేస్తూ తుది నిర్ణయం తీసుకుంది. శనివారం ఆస్ట్రేలియాతో తొలి వన్డే జరగనున్న నేపథ్యంలో ఈ వివాదం ఖచ్చితంగా భారత్‌కు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. జట్టులో కొనసాగించకుండా వీరిద్దరినీ వెంటనే స్వదేశానికి పిలిపించాలని బోర్డు నిర్ణయించింది.


ఆసియాకప్‌లో గాయపడిన పాండ్యా.. వెస్టిండీస్‌, ఆస్ట్రేలియాలతో సిరీస్‌లకు దూరమయ్యాడు. ఆసీస్‌తో మూడో టెస్ట్‌కే సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నప్పటికీ తుది జట్టులో అవకాశం లభించలేదు. ఈ నేపథ్యంలో శనివారం ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌తోనైనా తన పునరాగమనాన్ని ఘనంగా చాటాలని భావించిన పాండ్యాకు నోటీ దురుసు షాకిచ్చింది.