ఆధార్ కార్డ్ పోతే అయిదు రోజుల్లో..

అన్నిటికీ ఆధార్ కార్డ్‌. అదే ఆధారం. అది ఉంటే చాలు. మరేమీ అక్కరలేని పరిస్థితి తీసుకు వచ్చింది ప్రభుత్వం. మరి అలాంటి ఆధార్ కార్డ్ పోయిందంటే ఎన్ని తిప్పలో. దాన్ని తిరిగి పొందాలంటే ఉన్న ఒకే ఒక్క మార్గం UIDAI వెబ్ సైట్ ద్వారా కార్డు పొందే సరికొత్త విధానాన్ని మన ముందుకు తీసుకు వచ్చింది.
ఈ కొత్త ఆధార్ కార్డు స్పీడ్ పోస్ట్ ద్వారా మీ అడ్రస్‌కి కేవలం 5 రోజులలో వస్తుంది.
రీ-ప్రింటింగ్ రిక్వెస్ట్ రైజ్ చేయడానికి మీ ఆధార్ కార్డు నంబరు లేదా వర్చువల్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి.
మొదటగా మీరు చేయవలసిన పని వెబ్‌సైట్ www.Uidai.govt.in ఓపెన్ చేయాలి. అందులో ఆధార్ సర్వీస్‌పై క్లిక్ చేయాలి. అది ఓపెన్ అయ్యాక ఆధార్ రీ-ప్రింట్ బేసిస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. వెంటనే ఇంకో ట్యాబ్ ఓపెన్ అవుతుంది. మీ ఆధార్ కార్డు నెంబర్ లేదా వర్చువల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే సెక్యూరిటీ కోడ్‌ని బాక్స్‌లో ఎంటర్ చేయాలి.
మీరు ముందే మీ నెంబర్‌ను రిజిస్టర్ చేసి ఉంటే సెండ్ OTP అనే బటన్‌ని క్లిక్ చేయండి. ఒకవేళ మీరు రిజిస్టర్ చేసి ఉండనట్లైతే రిజిస్టర్ చేసుకోలేదు అని బాక్స్‌పై క్లిక్ చేయండి.
ఇప్పుడు మీ ఫోన్ నెంబర్‌కి వచ్చిన OTP ని ఎంటర్ చేయండి. మీ వివరాలను చెక్ చేసుకొని మేక్ పే మెంట్ అని ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీకు ఏ పద్దతి ఈజీగా అనిపిస్తే దాంట్లో అమౌంట్ పే చేయాలి.
ఈ ప్రక్రియ అంతా పూర్తి అయ్యాక స్క్రీన్ పైన కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. అలాగే ఫీచర్ రిఫరెన్స్ కోసం SRN నెంబర్ మీ మొబైల్‌కి వస్తుంది. ఒకవేళ మీ మొబైల్ నెంబర్‌ని రిజిస్టర్ చేసుకోకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. ఫైనల్‌గా మీ ఆధార్ కార్డ్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే www.resident.uidai.govt.in check-aadhar-reprintg లింకును క్లిక్ చేయండి. మీ ఫోన్‌కు వచ్చిన SRN నెంబర్‌ను ఎంటర్ చేయాలి. సెక్యూరిటీ కోడ్‌ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి.

Recommended For You