అతను నన్ను వదిలేశాడు : తాప్సి

Interesting Love Life Of Actress Tapsee Pannu

తాప్సి ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె సహజ నటన.. టాలీవుడ్ లో పెద్దగా రానించలేకపోయినా.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సాహసం వంటి ప్రయోగాత్మక చిత్రంలో నటించి మంచి మార్కులే సంపాదించింది. అయితే అప్పుడప్పుడు చిలిపి మాటలతో ప్రేక్షకులను అలరించే తాప్సి ఈసారి తన చిన్ననాటి విషయాన్నీ బయటపెట్టి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

Also read : సీపీఐ మాజీ రాష్ట్ర కార్యదర్శి కన్నుమూత

అదేమిటంటే.. ‘నేను 9వ తరగతిలో చదువుతున్నప్పుడే ఒకబ్బాయితో ప్రేమలో పడ్డాను…కాని పదోతరగతి పరీక్షలు వస్తున్నాయని నన్ను అతను వదిలేశాడు.. ఆ తరువాత నన్నెందుకు వదిలేసావు అని పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి ఫోన్ చేసి అడిగేదాన్ని.. ఏడ్చే దాన్ని… నాటి ఘటనలు ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తోంది’ ఈ అంటూ తాప్సీ తన చిన్ననాటి ప్రేమ బాగోతాన్ని బయటపెట్టింది. దాంతో తాప్సి అభిమానులకు ఈ విషయం ఆసక్తికరంగా మారింది.