జగన్‌పై దాడి కేసులో NIA టీమ్‌ యాక్షన్ ప్లాన్ సిద్ధం

jagan attacking case updates

జగన్‌పై దాడి కేసులో ఎన్‌ఐఏ విచారణ మొదలైంది. దర్యాప్తులో ఇప్పటి వరకూ లభించిన ఆధారాల వివరాలన్నీ జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులకు అప్పగించాలని విజయవాడ NIA కోర్టు ఆదేశించింది. దీంతో.. నిందితుడు శ్రీనివాసరావును విశాఖ నుంచి విజయవాడకు తీసుకొచ్చారు పోలీసులు. అర్థరాత్రి గట్టి భద్రత మధ్య అతన్ని తరలించారు. కాసేపట్లో విజయవాడ NIA కోర్టులో ప్రవేశపెట్టాక తిరిగి జైల్‌కు పంపుతారు.

Also read : చిన్న వ్యాపారులకు శుభవార్త..

జగన్ కేసు NIAకు బదిలీ చేయాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది. ఈ కేసులో దాఖలైన పిటిషన్లు అన్నీ విచారించి ఈనెల 4వ తేదీన ఈ తీర్పు ఇచ్చింది. ఐతే.. ఏపీ ప్రభుత్వం అప్పీల్‌కి వెళ్లే ఉద్దేశంతో ఆ వివరాలు ఇవ్వలేదు. వారం రోజలుుగా NIA టీమ్ విశాఖలోనే ఉన్నా.. స్థానిక పోలీసుల నుంచి సహకారం లేకపోవడంతో కోర్టు ద్వారా కేసు సంబంధిత పత్రాలు తెప్పించుకునే ప్రయత్నం చేశారు. విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో రిక్విజేషన్‌ పిటిషన్‌ వేశారు. తాము ఇప్పటికే FIR కూడా నమోదు చేశామని కోర్టుకు చెప్పారు. రికార్డులన్నీ తమకు ఇవ్వాలని కోరారు. దీంతో ఆ వివరాలన్నీ అందించాలని విశాఖ ఏడో మెట్రోపాలిటన్ మేనిస్ట్రేట్‌ను విజయవాడ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించింది.

కోర్టు ద్వారా కేసు ఫైళ్లు తెప్పించుకుంటున్న NIA త్వరలోనే పూర్తిస్థాయిలో దర్యాప్తుకు సిద్ధమవుతోంది. ఇవాళ శ్రీనివాసరావును విజయవాడ కోర్టులో ప్రవేశపెడతారు. అటు, ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందన్నది కూడా ఆసక్తి రేపుతోంది. కేంద్రం ఉద్దేశపూర్వకంగానే ఈ అంశంలో జోక్యం చేసుకుంటోందనని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆరోపిస్తోంది. తమ నిరసనను కేంద్రానికి లేఖద్వారా కూడా తెలియచేయాలని భావిస్తోంది. దీనిపై హైకోర్టులో పిటిషన్ వేయాలని కూడా భావిస్తోంది. ఐతే.. ఇలాంటి ఇబ్బందులన్నీ దాటుకుని విచారణ ముందుకు తీసుకెళ్లేందుకు NIA టీమ్‌ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటోంది.