అయ్యో.. ఏం కష్టం వచ్చిందో ఏమో..

married-woman-commits-suicide-srikakulam

వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తండ్యాం పంచాయతీ పరిధిలోని శ్రీరామ్‌నగర్‌ కాలనీలో గురువారం వెలుగుచూసింది. కాలనీకి చెందిన మేదరమెట్ల వెంకటరమన, సంధ్య(28) మూడేళ్ళ కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి పాప లహరి ఉంది. ఏమైందో ఏమో బుధవారం రాత్రి సంధ్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయాన్నే భర్త వెంకట రమణ లేచి చూసే సరికి సంధ్య ఉరికి వేలాడుతూ కనిపించింది. దాంతో వెంటనే ఉరితాడును కోసి ఆమెను కింద పడుకోబెట్టాడు. ఆ తరువాత మృతురాలి సోదరుడికి విషయం చెప్పాడు. సోదరుడితోపాటు అమ్మానాన్న కాళ్ల వరలక్ష్మి, శంకరరావు శ్రీరామ్‌నగర్‌ కు వచ్చారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులకు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.

Also read : జగన్‌పై దాడి కేసులో NIA టీమ్‌ యాక్షన్ ప్లాన్ సిద్ధం

బెడ్ మీద ఓ లెటర్ ను స్వాధీనం చేసుకున్నారు. అందులో పాపను బాగా చూసుకోమని, ఈ ఇంట్లోనే ఉండాలని.. అలాగే తన భర్త ఇబ్బందులు పెడుతూ అనుమానిస్తుండటంతో ఆత్మహత్య చేసుకొంటున్నట్టు ఉందని పోలీసులు తెలిపారు. దాంతో దీన్ని ఆత్మహత్యగా నమోదు చేసినట్టు వారు తెలిపారు. అయితే తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తెను అల్లుడే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. నిత్యం తాగడం సంధ్యను అనుమానించడం, కొట్టడం వంటివి అల్లుడు చేసేవాడని అంటున్నారు. తన కుమార్తె ఆత్మహత్య చేసుకొనేంత పిరికిది కాదని వారు చెబుతున్నారు. ఇదిలావుంటే తల్లిని విడిచి ఒక్క క్షణమైనా ఉండలేని మృతురాలి కుమార్తె లహరి తీవ్రంగా ఏడుస్తోంది. పాపను ఓదార్చడం ఎవరి వల్లే కాలేదు.