మహిళకు రుతుక్రమం అని గుడిసెలో ఉంచారు..తెల్లారి లేచి చూస్తే..

menstruation hut

నేపాలలో ఓ ఆనాగరిక ఆచారం మహిళ, ఆమె ఇద్దరు పిల్లలను బలి తీసుకుంది. రుతుక్రమం సమయంలో ఆమెను పిల్లలను ఇంటి బయట ఉన్న ఓ గుడిసెలో
ఉంచారు. దీంతో గాలీ వెలుతురు లేక ఊపిరాడక ఆమెతో పాటు ఇద్దరు కుమారులు మృతి చెందారు. ఈ దారుణమైన సంఘటన బజూరా జిల్లాలో చోటుచేసుకుంది.
రాత్రి భోజనం తర్వాత ఆమె తన పిల్లలతో కలిసి నిద్రపోవడానికి చిన్న గుడిసెలోకి వెళ్లారు. ఆ గుడిసె సమీపంలో కొంతమంది చలిమంట వేయగా ఓ నిప్పు రవ్వ
వచ్చి వారు కప్పుకున్న దుప్పటికి అంటుకుంది. దీంతో పొగ గుడిసె లోపల వ్యాపించి అక్కడే నిండిపోయింది. నిద్ర మత్తుల్లో ఉన్న వారు ఏం జరుగుతుందో తెలియక
అలాగే నిద్రపోయారు. మరుసటి రోజు ఆమె అత్త గుడిసెలోకి వెళ్లి చూడగా ముగ్గురూ మృతి చెందారు. పొగ వల్ల వారు ఊపిరాడక మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
ఈ ఘటనపై ప్రభుత్వం స్పదించి్ంది. విచారణకు ఆదేశించింది

Recommended For You