ఆయన రాకపోవడంతో..ఆ కాపీని శ్రీనివాస్‌కే అందించిన..

jagan-attacking-case-accused-srinivas-in-far-away-other-prisoners

జగన్‌పై దాడి కేసులో శ్రీనివాస్‌ను విజయవాడలోని NIA కోర్టులో హాజరుపరిచిన అధికారులు. శ్రీనివాస్‌కు కోర్టు ఈనెల 25 వరకూ రిమాండ్ విధించింది. ఇవాళ నిందితుడు తరపు న్యాయవాది కోర్టుకు రాలేదు. దీంతో.. ఆ కస్టడీ కాపీని శ్రీనివాస్‌కే అందించారు. అనంతరం అన్ని విజయవాడ సబ్‌జైల్‌కు తరలించారు. అటు, కేసు దర్యాప్తులో వాస్తవాలు తేల్చాలంటే శ్రీనివాస్‌ను కస్టడీకి ఇవ్వాలంటూ ఎన్‌ఐఏ ఆఫీసర్లు పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అటు, కోర్టు ఆదేశాలతో విశాఖ నుంచి ఈ కేసుకు సంబంధించిన ఫైళ్లు కూడా కేంద్రదర్యాప్తు సంస్థకు అందనున్నాయి. ఆ వెంటనే జగన్‌పై దాడి వెనుక కుట్రకోణంపై పూర్తి వివరాలు రాబట్టేలా లోతైన విచారణ చేయనున్నారు.